బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా మూడు వికెట్లు తేడాతో విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 70 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీనికి ప్రధాన కారణం బంగ్లా స్పిన్నర్ మెహదీ హసన్. టాపార్డర్‌ను కకావికలం చేసిన మెహదీ హసన్ ఐదు వికెట్లు తీసి టీమిండియాను భయపెట్టాడు.
అతని ధాటికి ఒక దశలో టీమిండియా ఓడిపోయేలా కనిపించింది. కానీ భారత్‌ను గెలిపించే బాధ్యత తాము తీసుకున్నట్లుగా శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్‌లు ఆడారు. ఇక టీమిండియాను భయపెట్టిన మెహదీ హసన్ బౌలింగ్‌ను రవిచంద్రన్ అశ్విన్ ఉతికారేశాడు. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ అతని బంతులు ఎదుర్కోవడంలో విఫలమైతే.. అశ్విన్ మాత్రం మెహదీ హసన్‌ను ఊచకోత కోశాడు.
టీమిండియా విజయానికి 16 పరుగులు అవసరమైన దశలో మెహదీ హసన్ మరోసారి బౌలింగ్‌కు వచ్చాడు. మెహదీ హసన్ వేసిన తొలి బంతినే ఒంటి చేత్తో భారీ సిక్సర్‌గా మలిచిన అశ్విన్ అతనికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పాడు. ఆ తర్వాత రెండు పరుగులు.. ఓవర్ ఐదు, ఆరు బంతులను ఫోర్లుగా మలిచి టీమిండియాను గెలిపించాడు. అలా టీమిండియాను భయపెట్టిన మెహదీ హసన్ బౌలింగ్‌లో 16 పరుగులు పిండుకొని బంగ్లా నుంచి విజయాన్ని లాక్కున్నాడు.
6,2,0,0,4,4 by Ashwin and won it for India, what an incredible batting by one of the great of Test cricket. pic.twitter.com/iQ6v8EKlXU
— Johns. (@CricCrazyJohns) December 25, 2022
చదవండి: హమ్మయ్య గెలిచాం.. భారత్‌ను గెలిపించిన అయ్యర్, అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment