రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ జట్టు పతనం అంచుల వరకు పోయి తిరిగి నిలదొక్కుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గౌరవప్రదమైన స్కోర్ దిశగా సాగుతుంది. లిటస్ దాస్ (86 నాటౌట్), మెహిది హసన్ మిరజ్ (78) ఏడో వికెట్‌కు 165 పరుగులు జోడించి బంగ్లాదేశ్ పతనాన్ని అడుకున్నారు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 30లోపు పరుగులకే 6 వికెట్లు కోల్పోయి అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా లిటన్-మిరజ్ జోడీ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 18 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా.. బొన్నర్-జాషువ డసిల్వ జోడీ ఏడో వికెట్‌కు 100 పరుగులు జోడించింది. లిటన్-మిరజ్ జోడీ 165 పరుగుల భాగస్వామ్యానికి ముందు ఇదే ప్రపంచ రికార్డుగా ఉండింది.
మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు మూడో సెషన్ సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. లిటన్ దాస్ 88, హసన్ మహమూద్ ఒక్క పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు బంగ్లాదేశ్ ఇంకా 74 పరుగులు వెనుకపడి ఉంది. పాక్ పేసర్ ఖుర్రమ్ షెహజాద్ ఆరు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. మీర్ హమ్జా 2 వికెట్లు పడగొట్టాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్, మిరజ్‌తో పాటు షద్మాన్ ఇస్లాం (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. సైమ్ అయూబ్ (58), షాన్ మసూద్ (57), అఘా సల్మాన్ (54) అర్ద సెంచరీలతో రాణించారు. బ్యాట్‌తో రాణించిన మిరజ్ బంతితోనూ (5/61) చెలరేగాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3, నిహద్ రాణా, షకీబ్ అల్ హసన్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment