టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి బంగ్లాదేశ్ చేతిలో ఓడిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు... రెండో టెస్టులోనూ భారీ స్కోరు చేయలేకపోయింది. వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోగా.. శనివారం రెండో రోజు టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది.
దీంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 85.1 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ షాన్ మసూద్ (69 బంతుల్లో 57; 2 ఫోర్లు), అయూబ్ (110 బంతుల్లో 58; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆగా సల్మాన్ (95 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలతో రాణించగా... బాబర్ ఆజమ్ (31), మొహమ్మద్ రిజ్వాన్ (29) ఫర్వాలేదనిపించారు.
బంగ్లాదేశ్ పేలవ ఫీల్డింగ్ కారణంగా అందివచ్చిన అవకాశాలను కూడా పాక్ ఉపయోగించుకోలేకపోయింది. బంగ్లా ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్‌లు వదిలేయడం విశేషం. బంగ్లాదేశ్ బౌలర్లలో ఆఫ్‌స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ 5 వికెట్లతో అదరగొట్టగా.. తస్కీన్ అహ్మద్ మూడు వికెట్లు తీశాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్... ఆట ముగిసే సమయానికి రెండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ఓపెనర్లు షాద్‌మన్ ఇస్లామ్ (6 బ్యాటింగ్), జాకీర్ హసన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
ఇన్నింగ్స్ తొలి బంతికే షాద్‌మన్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను స్లిప్‌లో షకీల్ వదిలేయడంతో బంగ్లాకు నష్టం జరగలేదు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రావల్పిండిలోనే జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్‌పై 10 వికెట్ల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ 1–0తో ఆధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment