ICC Mens T20 World Cup 2022 - Pakistan vs Bangladesh: ‘‘ఒక వికెట్ నష్టానికి 70 పరుగులతో పటిష్టంగానే కనిపించాం. ఈ పిచ్‌పై 145- 150 వరకు స్కోరు చేయగలం అనుకున్నాం. రాను రాను పిచ్ ప్రతికూలంగా మారుతుందనిపించడంతో పట్టుదలగా నిలబడాలనుకున్నాం. కానీ త్వరత్వరగా వికెట్లు పడ్డాయి’’ అని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అన్నాడు.
నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓటమి నేపథ్యంలో సెమీస్‌పై ఆశలు పెట్టుకున్న బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ చేతిలో పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. అడిలైడ్‌లో ఆదివారం నాటి ఈ కీలక మ్యాచ్‌లో పాక్ 5 వికెట్ల తేడాతో బంగ్లాపై గెలుపొంది సెమీస్ చేరగా.. షకీబ్ బృందం టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇదే అత్యుత్తమం
ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మాట్లాడుతూ.. మిగతా వరల్డ్‌కప్ టోర్నీలతో పోలిస్తే ఈ ఎడిషన్‌లో తాము అత్యుత్తమ ప్రదర్శన కనబరిచామన్నాడు. అయితే, ఇంకాస్త మెరుగ్గా ఆడితే సెమీస్‌కు చేరే వాళ్లమని, కానీ అలా జరుగలేదని విచారం వ్యక్తం చేశాడు.
వ్యక్తిగతంగా తన ప్రదర్శన పట్ల ఏమాత్రం సంతోషంగా లేనన్న ఈ స్టార్ ఆల్‌రౌండర్.. ఫిట్‌గా ఉన్నంత కాలం క్రికెట్ ఆడుతూనే ఉంటానంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ షాంటో 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
నాలుగో స్థానంలో వచ్చిన షకీబ్ వివాదస్పద రీతిలో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక బౌలింగ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన అతడు.. 35 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. కాగా గ్రూప్-2 నుంచి భారత్- పాకిస్తాన్ సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టగా.. గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి.
చదవండి: Temba Bavuma: ఈ ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం! ప్రధాన కారణం అదే
Comments
Please login to add a commentAdd a comment