ICC Men's T20 World Cup 2022: Pakistan vs Bangladesh Updates In Telugu - Sakshi
Sakshi News home page

Pak Vs Ban Updates: బంగ్లాదేశ్‌పై పాక్‌ ఘన విజయం.. సెమీస్‌లో అడుగు

Published Sun, Nov 6 2022 9:04 AM | Last Updated on Sun, Nov 6 2022 1:05 PM

WC 2022 Pak Vs Ban Do Or Die Battle: Playing XI Highlights Updates - Sakshi

ICC Mens T20 World Cup 2022 - Pakistan vs Bangladesh Updates In Telugu: బంగ్లాదేశ్‌పై గెలిచిన పాకిస్తాన్‌ గ్రూప్‌-2 నుంచి సెమీస్‌కు అర్హత సాధించింది. టీమిండియాతో పాటు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అడిలైడ్‌ వేదికగా ఆదివారం చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన బాబర్‌ ఆజం బృందం..  లక్ష్య ఛేదనలో భాగంగా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

మ్యాచ్‌ స్కోర్లు:
టాస్‌: బంగ్లాదేశ్‌
బంగ్లాదేశ్‌: 127/8 (20)
పాకిస్తాన్‌: 128/5 (18.1)

మహ్మద్‌ హారిస్‌ నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. స్కోరు:  121-4(17)

15 ఓవర్లలో పాకిస్తాన్‌ స్కోరు 94-3
నవాజ్‌ రనౌట్‌గా వెనుదిరగగా.. హారిస్‌, మసూద్‌ క్రీజులో ఉన్నారు.

రిజ్వాన్‌ అవుట్‌
పాక్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ను ఇబాదత్‌ హొసేన్‌ పెవిలియన్‌కు పంపాడు. 12వ ఓవర్‌ రెండో బంతికి షాంటోకు క్యాచ్‌ ఇచ్చి అతడు 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. హారిస్‌, నవాజ్‌ క్రీజులో ఉన్నారు. స్కోరు: 67/2 (11.5)

తొలి వికెట్‌ కోల్పోయిన పాక్‌
కెప్టెన్‌ బాబర్‌ ఆజం(25) రూపంలో పాక్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. పదకొండో ఓవర్‌ మూడో బంతికి నాసూమ్‌ అహ్మద్‌ బాబర్‌ను అవుట్‌ చేశాడు. స్కోరు: 58/1 (10.3). రిజ్వాన్‌, నవాజ్‌ క్రీజులో ఉన్నారు.

 పవర్‌ ప్లే ముగిసే సరికి పాక్‌ స్కోరు: 35-0
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ బ్యాటింగ్‌ కొనసాగుతోంది. ఓపెనర్లు బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌ క్రీజులో ఉన్నారు.

సెమీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌.. బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగింది. షాహిన్‌ ఆఫ్రిది 4 వికెట్లతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లా 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఏడో వికెట్‌ డౌన్‌
టస్కిన్‌ అహ్మద్‌ రూపంలో బంగ్లా ఏడో వికెట్‌ కోల్పోయింది. 19 ఓవర్లలో స్కోరు : 116-7

ఒకే ఓవర్లో రెండు వికెట్లు
17వ ఓవర్లో బంగ్లాదేశ్‌ రెండు వికెట్లు కోల్పోయింది. ఆఫ్రిది బౌలింగ్లో మొసద్దెక్‌ హొసేన్‌(5), నూరుల్‌ హసన్‌(0) అవుటయ్యారు. స్కోరు: 107/6 (17). అఫిఫ్‌, టస్కిన్‌ అహ్మద్‌ క్రీజులో ఉన్నారు.

బంగ్లాకు ఎదురుదెబ్బ
అర్ధ శతకంతో జోరు మీదున్న షాంటో(54) అవుటయ్యాడు. 14వ ఓవర్‌ రెండో బంతికి ఇఫ్తికర్‌ అహ్మద్‌.. షాంటోను బౌల్డ్‌ చేశాడు. దీంతో బంగ్లా నాలుగో వికెట్‌ కోల్పోయింది. పద్నాలుగు ఓవర్లలో స్కోరు: 92-4

షకీబ్‌ డకౌట్‌
బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ షాదాబ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో బంగ్లా మూడో వికెట్‌ కోల్పోయింది. 

రెండో వికెట్‌ కోల్పోయిన బంగ్లా
సౌమ్య సర్కార్‌(20) రూపంలో బంగ్లాదేశ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. షాదాబ్‌ బౌలింగ్‌లో మసూద్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. స్కోరు: 73/2 (10.4)

అర్ధ శతకానికి చేరువలో షాంటో
► 10 ఓవర్లలో బంగ్లాదేశ్‌ స్కోరు: 70/1. షాంటో 41, సౌమ్య సర్కార్‌ 18 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.
►7 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్‌ నష్టానికి బంగ్లా 49 పరుగులు చేసింది.  షాంటో, సౌమ్య సర్కార్‌ క్రీజ్లో ఉన్నారు. 

పవర్‌ప్లేలో బంగ్లా స్కోరు: 40-1

తొలి వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌.. ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయింది. గత మ్యాచ్‌లో భారత్‌పై మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన లిటన్‌ దాస్‌ 10 పరుగులు చేసి ఔటయ్యాడు. షాహిన్‌ అఫ్రిది బౌలింగ్‌లొ మసూద్‌కు క్యాచ్‌ ఇచ్చి దాస్‌ ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్‌ వికెట్‌ నష్టానికి 34 పరుగులు. షాంటో (18), సౌమ్య సర్కార్‌ (6) క్రీజ్లో ఉన్నారు. 

టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌
సెమీ ఫైనల్లో అడుగుపెట్టాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. పాకిస్తాన్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది.

గెలిచిన వాళ్లు సెమీస్‌కు! ఓడినవాళ్లు ఇంటికి
టీ20 ప్రపంచకప్‌-2022లో సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌- బంగ్లాదేశ్‌ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. గ్రూప్‌-2లో భాగమైన నెదర్లాండ్స్‌ ఆదివారం నాటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి.. ఇరు జట్లకు మార్గం సుగమం చేసింది.

ఇక బంగ్లాపై గెలిస్తే బాబర్‌ ఆజం బృందం.. టీమిండియాతో పాటు సెమీస్‌కు చేరడం లాంఛనమే కానుంది. మరి ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ పాక్‌ను నిలువరిస్తే దర్జాగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది.

తుది జట్లు:
పాకిస్తాన్‌:
మహ్మద్ రిజ్వాన్(వికెట్‌ కీపర్‌) బాబర్ ఆజం(కెప్టెన్‌), మహ్మద్ హారీస్‌, షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది.

బంగ్లాదేశ్‌:
నజ్ముల్ హొస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్‌), అఫిఫ్ హొస్సేన్, నూరుల్ హసన్(వికెట్‌ కీపర్‌), మొసద్దెక్ హొస్సేన్, టస్కిన్ అహ్మద్, నసుమ్ అహ్మద్, ఇబాదత్‌ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్.

చదవండి: టీ20 ప్రపంచ కప్‌లో పెను సంచలనం.. దక్షిణాఫ్రికాకు ఘోర పరాభవం
టీ20 వరల్డ్‌కప్‌లో ఆ జట్టుకు షాక్‌.. అత్యాచారం కేసులో క్రికెటర్‌ అరెస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement