పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం పేలవ ఫామ్ కొనసాగుతోంది. రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బాబర్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేసిన ఆజం.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులో వచ్చిన బాబార్ మరోసారి నిరాశపరిచాడు. చెత్త షాట్ ఆడుతూ స్లిప్‌లో దొరికిపోయాడు. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన పేసర్ నహిద్ రానా తొలి బంతిని బాబర్‌కు బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలవరీగా ఆఫ్ సైడ్ సంధించాడు. అయితే బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన ఆజం.. స్లిప్‌లో షాద్‌మాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Babar Retirement when??#PAKvsBAN #BabarAzam𓃵 pic.twitter.com/4d7urxWNA2
— 𝚃 𝚊 𝚋 𝚒 𝚜 𝚑 (@AaqibMushtaqBh4) August 31, 2024
కనీసం హాఫ్ సెంచరీ కూడా..
కాగా బాబర్ టెస్టుల్లో హాఫ్ సెంచరీ మార్క్ దాటడానికి తెగ కష్టపడుతున్నాడు. ఆజం టెస్టుల్లో హాఫ్ సెంచరీ సాధించి దాదాపు 20 నెలలు దాటింది. అతడు చివరగా డిసెంబర్ 2022లో న్యూజిలాండ్‌పై 161 పరుగులు చేశాడు. అప్పటి నుంచి హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోతున్నాడు.
జనవరి 2023 నుంచి ఇప్పటివరకు 16 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన ఆజం.. 21.33 సగటుతో కేవలం 331 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో బాబర్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. వెళ్లి జింబాబ్వేలో ఆడుకో అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.
पिछली 16 टेस्ट पारियों में एक भी अर्द्धशतक नहीं है। तुलना विराट कोहली से की जाती है। इस देश के साथ ही इस खिलाड़ी का बुरा दौर चल रहा...#PAKvsBAN#PakistanCricket #BabarAzam𓃵 #PAKvBAN pic.twitter.com/JxJjQufSsx
— RITESH SINGH (@RITESHK61848792) September 2, 2024
Comments
Please login to add a commentAdd a comment