పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్, స్టార్ ఆటగాడు బాబర్ ఆజం తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 66 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలో తిరిగి అడుగుపెట్టిన బాబర్.. తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు.
రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజం డకౌట్‌గా వెనుదిరిగాడు. బంగ్లా పేసర్ షోరీఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో బాబర్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. రెండు బంతులు ఆడిన బాబర్ పరుగులేమి చేయకుండా సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు.
పాక్ ఇన్నింగ్స్ 8 ఓవర్ వేసిన షోరిఫుల్ రెండో బంతిని లెగ్ స్టంప్ దిశగా బ్యాక్ లెంగ్త్ డెలివరీని ఆజంకు సంధించాడు. ఈ క్రమంలో ఆజం డౌన్ ది లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ దిశగా వెళ్లింది.
ఈ క్రమంలో వికెట్ కీపర్ లిట్టన్ దాస్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. లిట్టన్ దాస్ క్యాచ్ చూసిన బాబర్ బిత్తర పోయాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంతకుముందు ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లోనూ బాబర్ ఆజం దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఇప్పుడు టెస్టుల్లో కూడా అంతే. ఇక పాక్-బంగ్లా తొలి టెస్టు వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 21 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.
Itna Time Intzar kiya or Babar 0 Par Out Ho gya 💔💔#BabarAzam𓃵 #PAKvsBAN
pic.twitter.com/fiYsuDTH3Z— Moazam Chaudhary (@moazamch98) August 21, 2024
Comments
Please login to add a commentAdd a comment