బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిస్థితులు ఇంకా చల్లారడం లేదు. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినప్పటకి అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.
అయితే తాజాగా పాకిస్తాన్ క్రికెట్ వర్గాల నుంచి అభిమానులకు గుడ్‌న్యూస్ అందింది. ఇరు జట్ల మధ్య సిరీస్ యాధావిథిగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు టెస్టుల సిరీస్ ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17న పాకిస్తాన్‌కు బంగ్లా జట్టు బయలుదేరాల్సింది.
కానీ ఇప్పుడు ఐదు రోజుల ముందగానే బంగ్లా టీమ్ పాక్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఆగస్టు 12(మంగళవారం)న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు పాకిస్తాన్‌కు పయనం కానున్నట్లు ప్రముఖ క్రికెట్ బెబ్‌సైట్ క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది.
బంగ్లా ఆటగాళ్లకు అనుకున్నదానికంటే ఎక్కువ రోజులు ఆతిథ్యమివ్వడానికి పీసీబీ సిద్దంగా ఉన్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది. పర్యాటక జట్టు ప్రాక్టీస్ సెషన్స్ కోసం రావల్పిండిలో పీసీబీ అన్నిరకాల ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
కాగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు రావల్పిండి వేదికగానే జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ సైకిల్‌లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ పాకిస్తాన్‌కు చాలా కీలకం. ఈ క్రమంలోనే బంగ్లాతో టెస్టు సిరీస్‌పై పీసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్ మాత్రం ఇంకా తమ జట్టును ఎంపిక చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment