
వన్డే ప్రపంచకప్-2023లో మినుకుమినుకుమంటూ ఉండిన పాక్ సెమీస్ ఆవకాశాలు బంగ్లాదేశ్‌పై గెలుపుతో కాస్త మెరుగయ్యాయి. బంగ్లాపై విజయానంతరం పాక్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 4 పరాజయాలతో 6 పాయింట్లు సాధించింది.
ప్రస్తుతం పాక్ సెమీస్ చేరాలంటే ఇలా జరగాలి..
- ఆ జట్టు తదుపరి ఆడే రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించాలి. తదుపరి మ్యాచ్‌ల్లో పాక్ ప్రత్యర్థులు న్యూజిలాండ్, ఇంగ్లండ్ కావడంతో ఇది జరిగే పనేనా అని జనాలు అనుకుంటున్నారు.
- పాక్.. కివీస్, ఇంగ్లండ్‌లపై భారీ విజయాలు సాధించడంతో పాటు మరిన్ని సమీకరణలు జరగాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల్లో ఏదో ఒక జట్టు ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించాల్సి ఉంటుంది. ఇది పెద్ద విషయం కాకపోవచ్చు.
- సౌతాఫ్రికా, శ్రీలంకలు న్యూజిలాండ్‌ను ఓడించాల్సి ఉంటుంది. ఇది ఒకింత కష్టమే కావచ్చు.
- టీమిండియా.. శ్రీలంక,నెదర్లాండ్స్‌ను ఓడించాల్సి ఉంటుంది. ఇది పెద్ద విషయమేమీ కాకపోవచ్చు.
పై సమీకరణల ప్రకారం చూస్తే పాక్ సెమీస్‌కు చేరడం అంత సులువైన విషయం కాదనిపిస్తుంది. కింది మూడు జరిగినా, పాక్.. కివీస్, ఇంగ్లండ్‌లపై భారీ విజయాలు సాధించడమనేది సాధ్యపడకపోవచ్చు. కాబట్టి ప్రస్తుత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో పాక్ సెమీస్ అవకాశాలు దాదాపుగా గల్లంతే అని చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత్, సౌతాఫ్రికాలు సెమీస్ రేసులో ముందున్న విషయం తెలిసిందే. భారత్ 6 మ్యాచ్‌ల్లో ఆరింటిలో గెలిచి టేబుల్ టాపర్‌గా ఉండగా.. సౌతాఫ్రికా 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి రెండో స్థానంలో కొనసాగుతుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు చెరి 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నాయి.
పాక్‌తో పోలిస్తే ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఇంకాస్త మెరుగైన అవకాశాలు (సెమీస్) ఉన్నాయని చెప్పాలి. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించింది.
సెమీస్ అవకాశాలు ఏ జట్టుకు ఎంత శాతం ఉన్నాయంటే..
- భారత్ 99.9%
- సౌతాఫ్రికా 95%
- న్యూజిలాండ్ 75%
- ఆస్ట్రేలియా 74%
- ఆఫ్ఘనిస్తాన్ 31%
- పాకిస్తాన్ 13%
- శ్రీలంక 6%
- నెదర్లాండ్స్ 5.8%
- ఇంగ్లండ్ 0.3%
- బంగ్లాదేశ్ 0%
Comments
Please login to add a commentAdd a comment