
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్న స్టార్ ఆల్‌రౌండర్ అమీర్ జమీల్‌ను జట్టు నుంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది.
బంగ్లాతో తొలి టెస్టు సమయానికి జమీల్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని భావించిన సెలక్టర్లు.. తొలుత అతడికి ప్రధాన జట్టులో చోటు కల్పించారు. కానీ అతడు ఇంకా ఫుల్ ఫిట్‌నెస్ సాధించకపోవడంతో పీసీబీ జట్టు నుంచి రిలీజ్ చేసింది. అతడిని లాహోర్‌లోని ఏన్సీఎలో రిపోర్ట్ చేయాలని పీసీబీ ఆదేశాలు జారీ చేసింది.
“బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందు రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అమీర్ జమాల్‌ను టెస్ట్ జట్టు నుండి విడుదల చేశాము. అతడు తన ఫిట్‌నెస్‌ను తిరిగి పొందేందుకు లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా రావల్పిండి వేదికగా ఆగస్టు 21 నుంచి జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
బంగ్లాతో టెస్టులకు పాక్ జట్టు
షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, ఖుర్రం షాజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్-కీపర్), నసీమ్ షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్-కీపర్) మరియు షాహీన్ షా ఆఫ్రిది
Comments
Please login to add a commentAdd a comment