అశ్విన్ మరో ఘనత | After Antigua heroics, Ashwin is No.1 Test bowler again | Sakshi
Sakshi News home page

అశ్విన్ మరో ఘనత

Published Tue, Jul 26 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

అశ్విన్ మరో ఘనత

అశ్విన్ మరో ఘనత

* ఐసీసీ ఆల్‌రౌండర్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్
* భారత్ నుంచి ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్

దుబాయ్: భారత క్రికెటర్ అశ్విన్ మరో అద్భుత ఘనత సాధించాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. గతంలో వినూ మన్కడ్, కపిల్‌దేవ్ మాత్రమే ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్లు. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో బౌలింగ్‌లో రాణించడంతో పాటు బ్యాటింగ్‌లో సెంచరీ సాధించిన అశ్విన్ ఖాతాలో ప్రస్తుతం 427 పాయింట్లు ఉన్నాయి.

ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లోనూ అశ్విన్ తిరిగి నంబర్‌వన్ స్థానానికి చేరాడు. గతేడాది చివర్లో నంబర్‌వన్‌గా ఉన్న అశ్విన్... ఆరు నెలల తర్వాత తిరిగి అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నాడు. రెండో స్థానంలో ఉన్న అండర్సన్ (875పాయింట్లు) అశ్విన్‌కన్నా ఒక్క పాయింట్ తక్కువగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement