ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సత్తా చాటారు. చాలాకాలం తర్వాత ఈ ఇద్దరూ టాప్-10లోకి వచ్చారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 172 పరుగులతో రాణించిన కోహ్లి 775 రేటింగ్ పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకగా.. అదే దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపించిన హిట్‌మ్యాన్ 748 రేటింగ్ పాయింట్లు సాధించి 14 నుంచి పదో స్థానానికి చేరాడు.
Virat Kohli moves to number 6 in ICC Test batters ranking.
— Johns. (@CricCrazyJohns) January 9, 2024
- The GOAT is coming for the Top. 🐐 pic.twitter.com/m99Tii4eSW
తాజా ర్యాంకింగ్స్‌లో టాప్-3 బ్యాటర్స్‌లో (కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్) ఎలాంటి మార్పు లేకపోగా.. ఆసీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో దారుణంగా విఫలమైన పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ రెండు స్థానాలు కోల్పోయి ఎనిమిదో ప్లేస్‌కు పడిపోయాడు. ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకగా.. అతని సహచరుడు ఉస్మాన్ ఖ్వాజా నాలుగు స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు.
Rohit Sharma moves to number 10 in ICC Test batters ranking.
— Johns. (@CricCrazyJohns) January 9, 2024
- Hitman is back in the Top 10. ⭐ pic.twitter.com/T8evWfahYv
బౌలింగ్ విషయానికొస్తే.. కేప్‌టౌన్ టెస్ట్‌లో ఆరేసి ఇరగదీసిన టీమిండియా పేసర్లు సిరాజ్ (17), బుమ్రా (4) ర్యాంకింగ్స్‌ను భారీగా మెరుగుపర్చుకోగా.. సౌతాఫ్రికా సిరీస్‌లో సరైన అవకాశాలు రాని రవీంద్ర జడేజా ఓ స్థానం కోల్పోయి ఐదో ప్లేస్‌కు పడిపోయాడు. పాక్‌తో సిరీస్‌లో హ్యాట్రిక్ ఐదు వికెట్ల ప్రదర్శనలతో ఇరగదీసిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ రెండో స్థానానికి ఎగబాకగా.. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment