ICC Test Bowling Rankings: ఐసీసీ తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ప్రదర్శన కారణంగా నంబర్ వన్ ర్యాంకును కాపాడుకోగలిగాడు.
ఇక భారత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపరచుకుని నాలుగో స్థానంలో నిలిచాడు. అదే విధంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆరో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఇలా టాప్-10 బౌలర్లలో టీమిండియా నుంచి ముగ్గురికి స్థానం లభించింది.
బ్యాటర్లలో పోప్ ఏకంగా...
కాగా టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ ఆరు వికెట్లు తీశాడు. అదే విధంగా.. బుమ్రాకు కూడా ఆరు వికెట్లు లభించగా.. జడ్డూ ఐదు వికెట్లతో రాణించాడు.
అయితే, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ ఒలీ పోప్ అద్భుత సెంచరీ(196)తో జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 20 స్థానాలు ఎగబాకి సత్తా చాటాడు.
MEN'S TEST ALL-ROUNDER RANKINGS: ఎవరికీ అందనంత ఎత్తులో జడేజా!
మరోవైపు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో.. రవీంద్ర జడేజా 425 రేటింగ్ పాయింట్లతో ఫస్ట్ ర్యాంకు నిలబెట్టుకుని ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో వికెట్లు తీయడంతో పాటు జడ్డూ 89 పరుగులు చేశాడు. ఇక అశూ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియాతో మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన రూట్ స్టోక్స్‌ను దాటేశాడు.
ఇక హైదరాబాద్‌లో 28 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో తలపడనుంది. ఈ టెస్టుకు విరాట్ కోహ్లి ఇప్పటికే దూరం కాగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, కీలక బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయాల కారణంగా అందుబాటులో ఉండటం లేదు.
ఐసీసీ మెన్స్ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్-5
1. రవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 853 పాయింట్లు
2. కగిసో రబడ(సౌతాఫ్రికా)- 851 పాయింట్లు
3. ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- 828 పాయింట్లు
4. జస్‌ప్రీత్ బుమ్రా(ఇండియా)- 825 పాయింట్లు
5. జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా)- 818 పాయింట్లు
ఐసీసీ మెన్స్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ టాప్-5
1. రవీంద్ర జడేజా(ఇండియా)- 425 పాయింట్లు
2. రవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 328 పాయింట్లు
3. షకీబ్ అల్‌హసన్(బంగ్లాదేశ్)- 320 పాయింట్లు
4. జో రూట్(ఇంగ్లండ్)- 313 పాయింట్లు
5. బెన్ స్టోక్స్(ఇంగ్లండ్)- 307 పాయింట్లు.
చదవండి: Mayank Agarwal: ఆ బాటిల్ తీసుకుని తాగగానే వాంతులు.. భయంకర పరిస్థితి
Comments
Please login to add a commentAdd a comment