
జడేజాను వెనక్కు నెట్టి..
టెస్టుల్లో నంబర్‌వన్ బౌలర్‌గా ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ నిలిచాడు.
నంబర్‌వన్ బౌలర్‌గా జేమ్స్ అండర్సన్
ఐసీసీ టెస్టు ర్యాంకులు ప్రకటన
దుబాయ్: టెస్టుల్లో నంబర్‌వన్ బౌలర్‌గా ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ బౌలర్ల విభాగంలో అతడు టాప్‌కు చేరుకున్నాడు. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వెనక్కు నెట్టి అతడు అగ్రస్థానం దక్కించుకున్నాడు. 896 పాయింట్లతో మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. 884 పాయింట్లతో జడేజా రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా స్పిన్నర్ 852 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అండర్సన్ అద్భుతంగా రాణించాడు. తన కెరీర్ ఉత్తమ బౌలింగ్ (7/42) గణాంకాలతో చెలరేగడంతో పాటు 500 వికెట్ల క్లబ్‌లోనూ చేరాడు. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు పడగొట్టిన ఆరో ఆటగాడిగా నిలిచాడు.
కాగా, టెస్టుల్లో నంబవర్ టీమ్‌గా భారత్ కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా(2), ఇంగ్లండ్(3), న్యూజిలాండ్(4), ఆస్ట్రేలియా(5), పాకిస్తాన్(6), శ్రీలంక(7) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బ్యాట్స్‌మెన్ విభాగంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. జో రూట్(2), విలియమన్స్(3), పుజారా(4), డేవిడ్ వార్నర్(5) తర్వాతి స్థానాల్లో నిలిచారు.