
విరాట్ కోహ్లి
మంగళవారం ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకుల్లో.. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్
దుబాయ్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మంగళవారం ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకుల్లో కోహ్లి 922 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 913 పాయింట్లతో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీమిండియా టెస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర పుజారా తన మూడో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. జట్ల పరంగా భారత్ తొలిస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు తరవాతి స్థానంలో నిలిచాయి.
ఇక బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉండగా.. జేమ్స్ అండర్సన్(ఇంగ్లండ్), కగిసో రబడ(దక్షిణాఫ్రికా), ఫిలాండర్‌ట(దక్షిణాఫ్రికా) తరువాతి స్థానాల్లో నిలిచారు. భారత్ నుంచి రవీంద్ర జడేజా(6), రవిచంద్రన్ అశ్విన్(10) ఇద్దరే టాప్-10లో ఉన్నారు. ఆల్‌రౌండర్ జాబితాలో జాసన్ హోల్డర్(వెస్టిండీస్) అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్), రవీంద్ర జడేజా(భారత్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.