'టాప్'లోనే అశ్విన్ | Ashwin stays top all-rounder in ICC Test rankings | Sakshi
Sakshi News home page

'టాప్'లోనే అశ్విన్

Published Mon, Dec 21 2015 6:51 PM | Last Updated on Sun, Sep 3 2017 2:21 PM

'టాప్'లోనే అశ్విన్

'టాప్'లోనే అశ్విన్

భారత ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ఆల్ రౌండర్ల విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

దుబాయ్: భారత ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ఆల్ రౌండర్ల విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో అశ్విన్ 31.68 బ్యాటింగ్ సగటుతో  బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ ను కంటే మెరుగ్గు ఉండటంతో ప్రథమ స్థానాన్నిపదిలంగా ఉంచుకున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో అశ్విన్ బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్ లో అశ్విన్ 31 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత టెస్టు బౌలింగ్ విభాగంలో అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్నాడు.

 

ఇదిలా ఉండగా మరో భారత  ఆటగాడు రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ల విభాగంలో ఐదో ర్యాంకులో కొనసాగుతుండగా, బౌలర్ల విభాగంలో ఒక ర్యాంకు మెరుగుపరుచుకుని ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తరువాత స్థానాల్లో జోరూట్(ఇంగ్లండ్), ఏబీ డివిలియర్స్(దక్షిణాఫ్రికా)లు కొనసాగుతున్నారు. టాప్ -10 లో ఏ ఒక్క భారత  ఆటగాడికి స్థానం దక్కకపోవడం గమనార్హం. ఇక టెస్టు ర్యాంకింగ్స్ లో జట్ల విషయానికొస్తే దక్షిణాఫ్రికా 114 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, భారత్ 110 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తరువాత స్థానాల్లో ఆస్ట్రేలియా(109పాయింట్లు), పాకిస్తాన్(106 పాయింట్లు), ఇంగ్లండ్(99 పాయింట్లు) జట్లు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement