ఐసీసీ ఇవాళ (మే 2) విడుదల చేసిన ఎంఆర్‌ఎఫ్ వార్షిక టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్‌వన్ స్థానానికి ఎగబాకింది. రెండో ప్లేస్‌లో ఉండిన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాను వెనక్కునెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించింది. 15 నెలలుగా అగ్రపీఠంపై కర్చీఫ్ వేసుకుని కూర్చున్న ఆసీస్.. టీమిండియా దెబ్బకు కొండ దిగాల్సి వచ్చింది.
వచ్చే నెలలో (జూన్ 7) జరుగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు భారత్‌కు ఇది (టాప్ ర్యాంక్) మంచి బూస్టప్ ఇవ్వనుంది. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య టైటిల్ కోసం పోరు జరుగనున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే స్వదేశంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆసీస్‌ను మట్టికరిపించి.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది రోహిత్ సేన. ఇక ఇపుడు ఏకంగా నంబర్ 1గా అవతరించి మరోసారి అభిమానులను ఖుషీ చేసింది.
ఇదిలా ఉంటే.. ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత్ (121), ఆస్ట్రేలియా (116) తర్వాత ఇంగ్లండ్ (114), సౌతాఫ్రికా (104), న్యూజిలాండ్ (100), పాకిస్థాన్ (86), శ్రీలంక (84), వెస్టిండీస్ (76), బంగ్లాదేశ్ (45), జింబాబ్వే (32) వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి.
🚨 New World No.1 🚨
India dethrone Australia in the annual update of the @MRFWorldwide ICC Men's Test Rankings ahead of the #WTC23 Final 👀
— ICC (@ICC) May 2, 2023
కాగా, వార్షిక ర్యాంకింగ్‌లకు ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లతో పాటు 2020 మే- 2022 మే మధ్యలో జరిగిన సిరీస్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 20-22 మధ్యలో పూర్తైన సిరీస్‌లకు 50 శాతం, ఆతర్వాత జరిగిన సిరీస్‌లకు 100 శాతం పాయింట్లు కేటాయిస్తారు.
20-22 మధ్యలో ఆసీస్ గెలిచిన సిరీస్‌లకు తక్కువ వెయిటేజ్ ఉండటంతో ఆసీస్ 5 పాయింట్లు కోల్పోయి (121 నుంచి 116 పాయింట్ల) ఒకటి నుంచి రెండో స్థానానికి పడిపోయింది. ఫలితంగా టీమిండియాకు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment