దుబాయ్: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్, స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ దుమ్మురేపారు. తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చిన సిరాజ్.. 465 రేటింగ్ పాయింట్స్‌తో ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి దూసుకొచ్చాడు.
మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత శతకంతో అదరగొట్టిన కేఎల్ రాహుల్ 19 స్థానాలు మెరుగుపరుచుకుని 37వ ర్యాంక్‌కు ఎగబాకాడు. ఇక వరుసగా రెండు టెస్ట్‌ల్లో విఫలమైనా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఐదో స్థానాన్ని నిలబెట్టుకోగా, తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీతో రాణించిన రోహిత్ శర్మ(6వ ర్యాంక్) ర్యాంక్ మెరుగుపరుచుకోకపోయినా కెరీర్ బెస్ట్ 773 రేటింగ్ పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
↗️ Joe Root rises to No.2
— ICC (@ICC) August 18, 2021
↗️ Babar Azam moves up two spots
The latest @MRFWorldwide ICC Men's Test Player Rankings for batting 👇
🔗 https://t.co/OMjjVx5Mgf pic.twitter.com/ERYzCGm9Pc
ప్రస్తుతం రోహిత్ కంటే కోహ్లి కేవలం మూడు రేటింగ్ పాయింట్లు మాత్రమే ఎక్కువగా ఉన్నాడు. ఈ జాబితాలో రోహిత్ తర్వాతి స్థానంలో 736 పాయింట్లతో రిషబ్ పంత్ 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో టెస్ట్‌లో సూపర్ సెంచరీతో మెరిసిన ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ 893 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి దూసుకురాగా, కేన్ విలియమ్సన్(901) అగ్రస్థానంలో, స్టీవ్ స్మిత్(891) మూడో స్థానానికి, మార్నస్ లబుషేన్(878) నాలుగో ప్లేస్‌కు దిగజారారు.
James Anderson and Jason Holder make significant gains in the latest @MRFWorldwide ICC Men's Test Player Rankings for bowling 📈
— ICC (@ICC) August 18, 2021
🔗 https://t.co/OMjjVx5Mgf pic.twitter.com/sTDH9Rr6In
ఇక టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ జాబితాలో పాట్ కమిన్స్(908) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రవిచంద్రన్ అశ్విన్(848) సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. లార్డ్్స టెస్ట్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టిన ఆండర్సన్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని ఆరో స్థానానికి ఎగబాకగా, గాయంతో సిరీస్‌కు దూరమైన ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 8వ స్థానంలో, టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఒక ర్యాంక్ దిగజారి 10వ స్థానంలో నిలిచారు. ఇక, ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మూడు, నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. విండీస్ ఆటగాడు జేసన్ హోల్డర్ టాప్‌లో కొనసాగుతున్నాడు.
చదవండి: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఏంటంటే..?
Comments
Please login to add a commentAdd a comment