ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ వార్షిక సవరణ జాబితాలో భారత జట్టు రెండు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్
దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ వార్షిక సవరణ జాబితాలో భారత జట్టు రెండు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. సోమవారం తాజాగా ప్రకటించిన ఈ జాబితా లో 2011-12లో జట్ల ఫలితాలను తొలగిం చారు. 2013-14లో భారత జట్టు సాధించిన విజయాలు ర్యాంకింగ్‌లో 50 శాతం ప్రభావం చూపాయి. ఆసీస్‌కన్నా ఆరు పాయింట్లు ముందున్న దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. మూడో స్థానంలో కివీస్ ఉంది.