ఐసీసీ ర్యాంకింగ్స్‌: దుమ్మురేపిన పంత్‌.. దిగజారిన బాబర్‌ అజమ్‌ | Rishab Pant Rises 6th Rank And Babar Azam Drops To 9th ICC Test Rankings | Sakshi
Sakshi News home page

ఐసీసీ ర్యాంకింగ్స్‌: దుమ్మురేపిన పంత్‌.. దిగజారిన బాబర్‌ అజమ్‌

Published Wed, May 5 2021 5:34 PM | Last Updated on Wed, May 5 2021 8:05 PM

Rishab Pant Rises 6th Rank And Babar Azam Drops To 9th ICC Test Rankings - Sakshi

దుబాయ్‌: ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో రిషబ్‌ పంత్‌ సత్తా చాటాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరిచి తొలిసారి టెస్టు ర్యాంకింగ్స్‌ టాప్‌ టెన్‌లో ప్రవేశించిన పంత్‌ ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ ఆకట్టుకున్నాడు. తాజాగా పంత్‌(747 పాయింట్లు, ఆరో స్థానం) ఒక స్థానం ఎగబాకి తన కెరీర్‌ బెస్ట్‌ సాధించాడు. ఇక కోహ్లి(814 పాయింట్లు) ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కాగా రిషబ్‌ పంత్‌ హెన్రీ నికోలస్‌, రోహిత్‌ శర్మతో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు.

ఇక న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌ 919 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక ఆసీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ 891 పాయింట్లతో రెండో స్థానంలో.. 878 పాయింట్లతో మార్నస్‌ లబుషేన్‌ మూడు, జో రూట్‌ 831 పాయింట్లతో నాలుగో స్థానంలోఉన్నాడు. ఇక పాక్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజమ్‌ మూడు స్థానాలు దిగజారి 736 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో బాబర్‌ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. కాగా డేవిడ్‌ వార్నర్‌ 724 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నాడు.
చదవండి: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ కిడ్నాప్‌.. నలుగురు అరెస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement