ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. బౌలింగ్ విభాగంలో పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకే చెందిన రవిచంద్రన్ అశ్విన్‌ను వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించగా.. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో స్థానానికి ఎగబాకాడు.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. రిషబ్ పంత్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ పలు పాయింట్లు కోల్పోయి 9, 15, 16 స్థానాలకు పడిపోయారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా, మొహమ్మద్ రిజ్వాన్, లబూషేన్, డారిల్ మిచెల్ 2, 4, 5, 7, 8, 10 స్థానాల్లో ఉన్నారు.
ఈ వారం ర్యాంకింగ్స్‌లో భారీగా లబ్ది పొందిన బ్యాటర్లలో దినేశ్ చండీమల్ (20వ స్థానం), ఏంజెలో మాథ్యూస్ (23వ స్థానం), మొమినుల్ హక్ (42వ స్థానం), కుసాల్ మెండిస్ (43వ స్థానం), కేఎల్ రాహుల్ (49వ స్థానం), షద్మాన్ ఇస్లాం (79), మిచెల్ సాంట్నర్ (88) టాప్-100లో ఉన్నారు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత్ నుంచి బుమ్రా, అశ్విన్, రవీంద్ర జడేజా 1, 2, 6 స్థానాల్లో ఉండగా.. హాజిల్‌వుడ్, కమిన్స్, రబాడ, నాథన్ లియోన్, ప్రభాత్ జయసూర్య, కైల్ జేమీసన్, షాహీన్ అఫ్రిది టాప్-10లో ఉన్నారు. భారత పేసర్ ఆకాశ్‌దీప్ ఈ వారం ర్యాంకింగ్స్‌లో 12 స్థానాలు మెరుగపర్చుకుని 76వ స్థానానికి చేరాడు.
ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ టాప్-2గా కొనసాగుతున్నారు. అక్షర్ పటేల్ ఓ స్థానం కోల్పోయి ఏడో ప్లేస్‌కు పడిపోయాడు.
చదవండి: శతక్కొట్టిన సర్ఫరాజ్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment