
మూడో ర్యాంక్‌కు కోహ్లి
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మూడో స్థానానికి చేరాడు.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మూడో స్థానానికి చేరాడు. తన కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. ఇంగ్లండ్‌తో సిరీస్ ఆరంభానికి ముందు 15వ స్థానంలో ఉన్న కోహ్లి... ఏకంగా 12 ర్యాంక్‌లు మెరుగుపరుచుకోవడం విశేషం. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), రూట్ (ఇంగ్లండ్) తొలి రెండు ర్యాంక్‌ల్లో ఉన్నారు.
భారత్ నుంచి టాప్-10లో పుజారా (8వ ర్యాంక్) కూడా ఉన్నాడు. కోహ్లి ప్రస్తుతం టి20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో, వన్డేల్లో రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. బౌలింగ్, ఆల్‌రౌండర్ రెండు విభాగాల్లోనూ అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. జడేజా బౌలర్ల ర్యాంక్‌లో ఏడు, ఆల్‌రౌండర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు.