ICC Test Batting Rankings 2022: Virat Kohli and Rishabh Pant Moves Up, Rohit Slip 1 Spot - Sakshi
Sakshi News home page

ICC Test Rankings: ఐదో స్థానానికి కోహ్లి.. పాపం రోహిత్‌ మాత్రం..

Published Wed, Mar 9 2022 3:31 PM | Last Updated on Wed, Mar 9 2022 6:48 PM

ICC Test Rankings: Virat Kohli Rishabh Pant Moves Up Rohit slip 1 Spot - Sakshi

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో ముగ్గురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రెండు స్థానాలు మెరుగుపరచుకుని ఐదో ర్యాంకు(763 పాయింట్లు)కు చేరుకున్నాడు. ఇక ప్రస్తుత సారథి రోహిత్‌ శర్మ ఒక స్థానం దిగజారి ఆరో స్థానాని(761 పాయింట్లు)కి పడిపోయాడు. ఇక యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌(723 పాయింట్లు)ఒక స్థానం ఎగబాకి టాప్‌-10కు చేరుకున్నాడు.

కాగా ఆస్ట్రేలియా బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ ఈ జాబితాలో 936 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌ జోరూట్‌ 872, ఆసీస్‌ మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌ 851 పాయింట్లతో ఆ తర్వాతి స్థానాలు ఆక్రమించారు. ఇక న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో కోహ్లి,  రోహిత్‌ శర్మ, ట్రవిస్‌ హెడ్‌, దిముత్‌ కరుణరత్నే, బాబర్‌ ఆజం, రిషభ్‌ పంత్‌ ఉన్నారు.

ఇక వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23లో భాగంగా ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో కోహ్లి 45 పరుగులు చేయగా.. రోహిత్‌ 29, పంత్‌ 96 పరుగులు సాధించారు. ఆల్‌రౌండర్‌ జడేజా 175 పరుగులతో చెలరేగడంతో భారీ స్కోరు సాధించిన టీమిండియా ఈ  మ్యాచ్‌లో లంకపై ఘన విజయం సాధించింది. బ్యాట్‌, బంతితో అద్బుతం చేసిన జడేజా తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1 ఆల్‌రౌండర్‌గా నిలిచాడు.

చదవండి: IPL 2022- CSK: సీఎస్‌కే అభిమానులకు గుడ్‌న్యూస్‌.. అతడు వచ్చేస్తున్నాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement