Rohit sharma Enters Top 10 Yashasvi Roars: అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో అలరించిన టీమిండియా యువ సంచలనం యశస్వి జైశ్వాల్ తొలిసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించాడు. వెస్టిండీస్ గడ్డపై 171 పరుగులతో అదరగొట్టిన ఈ ముంబై బ్యాటర్.. తాజా ర్యాంకింగ్స్‌లో 73వ స్థానంలో నిలిచాడు. విండీస్‌తో డొమినికాలో ఓపెనర్‌గా బరిలోకి దిగి భారీ స్కోరు సాధించి అనేక రికార్డులు సాధించిన 21 ఏళ్ల యశస్వి తొట్టతొలి మ్యాచ్‌లోనే మెరుగైన ర్యాంకు సాధించాడు.
ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో విండీస్‌పై శతకంతో చెలరేగిన రోహిత్ శర్మ టాప్-10లోకి దూసుకువచ్చాడు. 221 బంతుల్లో 103 పరుగులు చేసిన ‘హిట్‌మ్యాన్’ మూడు స్థానాలు ఎగబాకి పదో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో 76 పరుగులు చేసిన రన్‌మెషీన్ విరాట్ కోహ్లి ర్యాంకులో మాత్రం ఎలాంటి మార్పూలేదు. అతడు పద్నాలుగో స్థానంలోనే కొనసాగుతున్నాడు.
ఇక యాక్సిడెంట్ కారణంగా సుదీర్ఘకాలంగా జట్టుకు దూరమైన టీమిండియా యువ వికెట్ బ్యాటర్ రిషభ్ పంత్ చాన్నాళ్ల తర్వాత ఒక స్థానం కోల్పోయి పదకొండో ర్యాంకుకు చేరుకున్నాడు. మరోవైపు.. న్యూజిలాండ్ వెటరన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ట్రవిస్ హెడ్, బాబర్ ఆజం, మార్నస్ లబుషేన్ టాప్-5లోనే కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే.. టీమిండియా వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
ఐసీసీ టెస్టు బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్: టాప్-5లో ఉన్నది వీళ్లే
1. కేన్ విలియమ్సన్- న్యూజిలాండ్- 883 పాయింట్లు
2. ట్రవిస్ హెడ్- ఆస్ట్రేలియా- 874 పాయింట్లు
3. బాబర్ ఆజం- పాకిస్తాన్- 862 పాయింట్లు
4. స్టీవ్ స్మిత్- ఆస్ట్రేలియా- 855 పాయింట్లు
5. మార్నస్ లబుషేన్- ఆస్ట్రేలియా- 849 పాయింట్లు.
చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో..
Comments
Please login to add a commentAdd a comment