
ముంబై: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ టాప్ లేపాడు. ఏకంగా 12 స్థానాలు ఎగబాకి టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. సఫారీతో జరిగిని చివరి టెస్టుకు ముందు 22వ స్థానంలో ఉన్న రోహిత్.. రాంచీ టెస్టులో డబుల్ సెంచరీ సాధించడంతో అతడి గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. 722 పాయింట్లతో పదో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఐసీసీ అన్ని ఫార్మట్లలో టాప్ 10లో నిలిచిన రెండో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ మరో రికార్డు అందుకున్నాడు. ఇప్పటివరకు సారథి విరాట్ కోహ్లి మాత్రమే మూడు ఫార్మట్లలో టాప్-10 స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక పుణే టెస్టులో డబుల్ సెంచరీ మినహా మరో భారీ స్కోర్ సాధించని విరాట్ కోహ్లి రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. అయితే ఆగ్రస్థానంలో కొనసాగుతున్న స్టీవ్ స్మిత్‌కు కోహ్లికి పాయింట్ల(11) వ్యత్యాసం పెరిగింది.
ఇక రాంచీ టెస్టులో సెంచరీ సాధించిన వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఐదో స్థానానికి చేరుకున్నాడు. మరో టెస్టు బ్యాట్స్‌మన్ చటేశ్వర పుజారా నాలుగో స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఇక ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మన్ టాప్-10లో నలుగురు ఉండటం విశేషం. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమైన జస్ప్రిత్ బుమ్రా మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. బుమ్రా మినహా భారత బౌలర్లు ఎవరూ టాప్ 10లో చోటు దక్కించుకోలేదు. రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలు 14, 15 స్థానాలలో కొనసాగుతున్నారు. సఫారీ జట్టును వైట్‌వాష్ చేయడంతో టెస్టుల్లో టీమిండియా ఆగ్రస్తానానికి మరింత బలం చేకూరింది. 119 రేటింగ్ పాయింట్లతో ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. తరువాతి స్థానాలలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి.
టాప్-5 ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్
బ్యాటింగ్: స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, పుజారా, రహానే
బౌలింగ్: ప్యాట్ కమిన్స్, కగిసో రబాడ, హోల్డర్, బుమ్రా, జేమ్స్ అండర్సన్
ఆల్‌రౌండర్స్: హోల్డర్, రవీంద్ర జడేజా, షకీబుల్ హసన్, బెన్ స్టోక్స్, ఫిలాండర్
టీమ్: టీమిండియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా
Comments
Please login to add a commentAdd a comment