కేఎల్ రాహుల్ మరో ఘనత | ICC Rankings: KL Rahul climbs to career best 11th | Sakshi
Sakshi News home page

కేఎల్ రాహుల్ మరో ఘనత

Published Thu, Mar 30 2017 7:13 PM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM

కేఎల్ రాహుల్ మరో ఘనత

కేఎల్ రాహుల్ మరో ఘనత

దుబాయ్: టీమిండియా ఓపెనర్ లోకేశ్‌ రాహుల్ టెస్టు ర్యాంకింగ్స్ లో లాంగ్ జంప్ చేశాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో 11వ స్థానంలో నిలిచాడు. అతడు ఏకంగా 46 స్థానాలు మెరుగుపరుచుకోవడం విశేషం. ఆస్ట్రేలియాతో టెస్టు సిరిస్ కు ముందు 57వ ర్యాంకులో ఉన్న అతడు 11వ స్థానానికి లాంగ్ జంప్ చేశాడు. ఆరు అర్ధసెంచరీలతో సత్తా చాటాడు. ఆసీస్ తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ లో 64, 10, 90, 51, 67, 60, 51 నాటౌట్ స్కోర్లతో అదరగొట్టాడు.

తాజా టెస్టు ర్యాంకుల్లో మూడో అత్యుత్తమ భారత బ్యాట్స్ మన్ గా రాహుల్ నిలిచాడు. పుజారా(4), విరాట్ కోహ్లి(5) టాప్ టెన్ లో కొనసాగుతున్నారు. అజింక్య రహానే మూడు స్థానాలు ఎగబాకి 14వ ర్యాంకు దక్కించుకున్నాడు. మురళీ విజయ్ నాలుగు స్థానాలు పడిపోయి 34వ ర్యాంకులో ఉన్నాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ టాప్ లో ఉన్నాడు.

బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఫాస్ట్ బౌలర్ ఉమేశ్‌ యాదవ్ 5 స్థానాలు మెరుగుపరుచుకుని 21వ ర్యాంకులో నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement