
ఐపీఎల్-2024లో భాగంగా లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రెగ్యూలర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన రాహుల్.. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ జానీ బెయిర్ స్టో అద్భుతమైన క్యాచ్‌తో రాహుల్‌ను పెవిలియన్‌కు పంపాడు.
లక్నో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఐదో బంతిని ఆఫ్ స్టంప్ వెలుపల లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని రాహుల్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆడటానికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో పాయింట్‌లో ఉన్న బెయిర్ స్టో ఎడమవైపు డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన రాహుల్ ఒక్కసారిగా బిత్తర పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్‌గా నికోలస్ పూరన్ వ్యవహరిస్తున్నాడు.
— Sitaraman (@Sitaraman112971) March 30, 2024
Comments
Please login to add a commentAdd a comment