
ఐర్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జూన్ 1న లండన్ వేదికగా ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు మ్యాచ్‌కు ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా దూరమయ్యాడు. అదే విధంగా కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడుతూ గాయపడ్డ ఆ జట్టు వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఫూర్తి ఫిట్‌నెస్ సాధించాడు.
దీంతో అతడికి ఐర్లాండ్‌తో టెస్టు జట్టులో చోటు దక్కింది. మరోవైపు కాలి గాయం కారణంగా దాదాపు ఏడాది నుంచి జట్టుకు దూరంగా ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో కూడా ఈ టెస్టుతో మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. టెస్టుల్లో ఇంగ్లండ్ వైస్ కెప్టెన్‌గా ఆలీ పోప్‌ను సెలక్షన్ కమిటీ నియమించింది.
ఐర్లాండ్‌తో ఏకైక టెస్టుకు ఇంగ్లండ్ జట్టు
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జొనాథన్ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఆలీ పోప్, మాథ్యూ పాట్స్, ఆలీ రాబిన్సన్, జో రూట్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్
చదవండి: నేను బౌలింగ్ చేసి ఉంటే రాజస్తాన్ 40 పరుగులకే ఆలౌటయ్యేది: కోహ్లి