హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ సంచలన బంతితో మెరిశాడు. అద్భుతమైన బంతితో ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ జానీ బెయిర్ స్టోను అక్షర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 32 ఓవర్‌లో అక్షర్ వేసిన 92.9 కి.మీ వేగంతో వేసిన బంతిని బెయిర్ స్టో డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు.
అయితే బంతి అనూహ్యంగా టర్న్ అయ్యి అఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఇది చూసిన బెయిర్ స్టో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో బెయిర్ స్టో(37) పరుగులు చేసి ఔటయ్యాడు. అక్షర్ ఈ వికెట్‌తో రూట్-బెయిర్ స్టో భాగస్వామ్యానికి తెర దించాడు.
𝗧𝗵𝗮𝘁. 𝗪𝗮𝘀. 𝗔. 𝗕𝗲𝗮𝘂𝘁! ⚡️ ⚡️@akshar2026 with his first wicket of the match 👏 👏
— BCCI (@BCCI) January 25, 2024
Follow the match ▶️ https://t.co/HGTxXf8b1E#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/liBwODtcrM
Comments
Please login to add a commentAdd a comment