బెయిర్‌స్టో
లండన్ : ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అనంతరం ఇంగ్లండ్ జట్టు తమ దేశానికే చెందిన మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలను ఎదుర్కొంటుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సారథి మోర్గాన్ భయపడ్డాడని కెవిన్ పీటర్సన్ చురకలంటించగా.. వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని మాజీ సారథి మైకేల్ వాన్ కామెంట్ చేశాడు. దీంతో ‘కొంతమందికి ఇంగ్లండ్ గెలవడం ఇష్టం లేదు. ఎప్పుడెప్పుడు ఓడిపోతుందా.. అంటూ జట్టుపై విమర్శలు చేయడానికి ఎదురుచూస్తున్నారు’ అని ఓపెనర్ బెయిర్‌స్టో స్పందించాడు. దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన మైకేల్ వాన్.. ‘బెయిర్ స్టోవి తప్పుడు ఆరోపణలు. ఇంతకుముందెన్నడూ లేనంత మద్దతు ప్రస్తుతం ఇంగ్లండ్‌కు లభిస్తుంది. అయితే నువ్వు, మీ జట్టు నిరాశ పరుస్తున్నారు. రెండు మ్యాచ్‌లు గెలిచి సెమీస్‌కు వెళ్లండి చాలు’ అని అన్నారు. బెయిర్‌స్టో వ్యాఖ్యలు దారుణమైనవి అని, ఇంగ్లండ్ ఓడిపోవాలని ఎవరూ అనుకోవడంలేదని అలా మాట్లాడటం భావ్యం కాదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment