![Bairstow Picks Top Two T20 Batters At Present - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/19/surya.gif.webp?itok=goUjUKID)
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన బెయిర్ స్టో.. 16.00 సగటుతో కేవలం 96 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో గురువారం(ఏప్రిల్ 18) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెయిర్ స్టోకు ఆడే అవకాశం దక్కలేదు.
అతడిని పంజాబ్ మెనెజ్‌మెంట్ పక్కన పెట్టి రిలీ రూసోను జట్టులోకి తీసుకువచ్చారు. కానీ రూసో కూడా నిరాశపరిచాడు. అయితే తాజాగా బెయిర్ స్టో ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫోకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో ప్రస్తుత వరల్డ్ క్రికెట్‌లో టాప్ 3 టీ20 బ్యాటర్లు ఎవరన్న ప్రశ్న బెయిర్‌స్టోకు ఎదురైంది.
బెయిర్ స్టో వెంటనే తన తొలి రెండు ఎంపికలగా దక్షిణాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్, భారత విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌లను ఎంచుకున్నాడు. మూడో ప్లేయర్‌ను ఎంచుకోవడానికి జానీ కాస్త సమయం తీసుకున్నాడు. కాస్త ఆలోచించి తన సహచర ఆటగాడు, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్‌ను తన మూడో ఛాయిస్ గా ఎంచుకున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఈఎస్పీఎన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ప్రస్తుత ఐపీఎల్‌లో అదరగొడుతున్న టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి,రోహిత్ శర్మలను బెయిరో స్టో ఎంచుకోపోవడం గమనార్హం.
Can you argue with this? 🤔 #25Questions with Jonny Bairstow 👉 https://t.co/u7aCIY24E4 pic.twitter.com/jIg4WSd7YQ
— ESPNcricinfo (@ESPNcricinfo) April 19, 2024
Comments
Please login to add a commentAdd a comment