ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాను చిత్తు చేసి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు బంగ్లా కూడా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది.
కోహ్లి రికార్డుపై కన్నేసిన సూర్య..
అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. రెండో టీ20లో సూర్య మరో 39 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా విరాట్ కోహ్లితో సమంగా నిలుస్తాడు.
కోహ్లి 73 మ్యాచ్‌ల్లో ఈ రేర్ ఫీట్ అందుకోగా.. ఇప్పుడు సూర్యకుమార్ కూడా ఢిల్లీ టీ20లో 39 పరుగులు చేస్తే సరిగ్గా 73 మ్యాచ్‌ల్లోనే అందుకుంటాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం అగ్రస్ధానంలో ఉన్నాడు. బాబర్ 67 మ్యాచ్‌ల్లోనే 2500 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.
రెండో టీ20కు భారత తుది జట్టు(అంచనా)
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్.
Comments
Please login to add a commentAdd a comment