Virat Kohli, Jonny Bairstow Involved in Heated Exchange at Edgbaston - Sakshi
Sakshi News home page

ENG vs IND: కోహ్లి, బెయిర్‌ స్టో మధ్య మాటల యుద్దం.. వీడియో వైరల్‌..!

Published Sun, Jul 3 2022 5:25 PM | Last Updated on Sun, Jul 3 2022 6:13 PM

Virat Kohli, Jonny Bairstow involved in heated exchange at Edgbaston - Sakshi

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌-భారత్‌ మధ్య జరుగుతోన్న ఐదో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. అయితే మూడో రోజు ఆట ప్రారంభంలోనే భారత స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి, ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జానీ బెయిర్‌ స్టో మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. ఈ ఘటన ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ షమీ వేసిన 32 ఓవర్‌లో జరిగింది. షమీ బౌలింగ్‌లో బెయిర్‌స్టో ఆడటానికి ఇబ్బంది పడుతూ కనిపించాడు.

ఈ క్రమంలో స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లి బెయిర్‌స్టోను చూసి నవ్వుకున్నాడు. ‘సౌథీ కంటే షమీ వేగంగా బంతులు వేస్తున్నాడు కదా" అని కోహ్లి కామెంట్‌ చేశాడు. అంతే కాకుండా "నీకు బాల్ తప్ప అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి" అంటూ కోహ్లి సెడ్జింగ్ చేశాడు. అది విన్న బెయిర్‌స్టో కూడా తిరిగి స్పందించి కోహ్లిని ఎదో అన్నాడు. దీంతో వీరిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అయితే ఫీల్డ్ అంపైర్‌తో పాటు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ కలగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండిENG vs IND: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement