
మాంచెస్టర్: వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే తొలి టెస్టు కోసం ఇంగ్లండ్ 13 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఇందులో బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో, ఆల్‌రౌండర్ మొయిన్ అలీలకు చోటు దక్కలేదు. గత దక్షిణాఫ్రికా పర్యటనలో రాణించిన ఆటగాళ్లపైనే ఈసీబీ నమ్మకముంచింది. రెగ్యులర్ కెప్టెన్ రూట్ గైర్హాజరులో తనకు అవకాశం దక్కుతుందని బెయిర్‌స్టో ఆశించినా...వార్మప్ మ్యాచ్‌లో విఫలం కావడంతో అతని పేరును పరిగణలోకి తీసుకోలేదు. అలీని కూడా అదే తరహాలో పక్కన పెట్టారు. ఈ 13 మందితో పాటు కోవిడ్–19 నేపథ్యంలో మరో 9 మందిని రిజర్వ్ ఆటగాళ్లుగా ఈసీబీ సిద్ధంగా ఉంచింది. బుధవారంనుంచి ఏజియస్ బౌల్‌లో తొలి టెస్టు జరుగుతుంది.
ఇంగ్లండ్ జట్టు వివరాలు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), అండర్సన్, ఆర్చర్, డొమినిక్ బెస్, బ్రాడ్, రోరీ బర్న్‌స్, బట్లర్, క్రాలీ, డెన్లీ, సిబ్లీ, ఒలీ పోప్, వోక్స్, మార్క్‌వుడ్.
Comments
Please login to add a commentAdd a comment