
వన్డే ప్రపంచకప్-2023 వార్మప్ మ్యాచ్‌లలో భాగంగా శనివారం గౌహతి వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు గౌహతికి చేరుకున్నాయి. అయితే ఢిఫెండింగ్ చాంపియన్స్ ఇంగ్లండ్ జట్టుకు మాత్రం తమ ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లీష్ జట్టు తమ విమాన ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.
దాదాపు 38 గంటల పాటు ఆ జట్టు ఆటగాళ్లు ఎకానమీ క్లాస్‌లో విమానంలో ప్రయాణించారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇంగ్లండ్ నుంచి గువహతి వరకు ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణించడంపై బెయిర్‌స్టో అసహనం వ్యక్తం చేశాడు. వారు విమానంలో ప్రయాణిస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
"అంతా గందరగోళంగా ఉంది. విమానంలోకి అడుగు పెట్టిన తర్వాత దాదాపు 38 గంటలకుపైగా ప్రయాణం సాగింది'' అంటూ నవ్వుతున్న ఎమోజిని క్యాప్షన్‌గా బెయిర్ స్టో పెట్టాడు.ఆ ఫోటోలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్, ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ ఉన్నారు. వారిద్దరూ బాగా ఆలసిపోయినట్లు కన్పించారు.
అదే విధంగా వారి చూట్టూ తోటి ప్రయాణికులు భారీగా గుమిగూడి ఉన్నారు. కాగా సాధరణంగా ఆటగాళ్లు ఎక్కువగా బిజినెస్ క్లాస్‌లోనే ప్రయాణిస్తారు. కానీ ఇంగ్లండ్ జట్టు విషయంలో ఎందుకు ఇలా జరిగిందో కారణం తెలియలేదు. ఇక ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.
ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గాస్ అట్కిన్‌సన్, జానీ బెయిర్‌స్టో, హారీ బ్రూక్, సామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, అదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్}
చదవండి: పరుగుల జోరులో కివీస్‌దే పైచేయి
Jonny Bairstow's Instagram story.
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 29, 2023
England team reached Guwahati in an economy class of a flight. pic.twitter.com/r3Uf3Klchz
Comments
Please login to add a commentAdd a comment