ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టు అన్నీ స్పిన్ పిచ్‌లే తయారు చేస్తుందని భావించడం లేదని ఆ జట్టు సీనియర్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో అభిప్రాయ పడ్డాడు. ప్రస్తుతం భారత పేస్ బౌలింగ్ దళం చాలా పటిష్టంగా ఉందని, అన్నీ స్పిన్ పిచ్‌లే ఉంటే వారి ప్రభావం తగ్గిపోతుందని అతను అన్నాడు. భారత్‌లో జరిగిన గత సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో బెయిర్‌స్టో మూడు సార్లు డకౌటయ్యాడు.
‘సిరీస్‌లో మాకు వేర్వేరు తరహాలో పిచ్‌లు ఎదురవడం ఖాయం. అయితే అన్నీ టర్న్ కాకపోవచ్చు. వారి పేస్ బౌలింగ్ ఇటీవల ఎలా ఉందో మేం చూస్తున్నాం. ఇప్పుడు పేస్ కూడా వారి బలం కాబట్టి తొలి రోజునుంచే టర్న్ అయ్యే పిచ్‌లు తయారు చేయకపోవచ్చు. అయితే ఎలా ఉన్నా పరిస్థితులకు తగినట్లుగా మా బ్యాటింగ్‌ను మార్చుకునేందుకు మేం సిద్ధంగా ఉండాలి.
అశ్విన్, జడేజా, అక్షర్... ఇలా బౌలర్ ఎవరైనా కావచ్చు. మేం అతిగా ఆలోచించడం లేదు. గత సిరీస్‌లో చెన్నైలో మేం కూడా టెస్టు మ్యాచ్ గెలిచామనే సంగతి మరచిపోవద్దు’ అని బెయిర్‌స్టో చెప్పాడు. 2021లో జరిగిన సిరీస్‌ను భారత్ 3–1తో సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment