Spin pitch
-
మళ్లీ స్పిన్ పిచ్‌కు సిద్ధమే!
విశాఖపట్నం: రెండో టెస్టులోనూ స్పిన్ పిచ్‌పై సమరానికి సిద్ధమని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అన్నాడు. స్పిన్నర్ టామ్ హార్లీ మాయాజాలంతో హైదరాబాద్ టెస్టులో గెలిచిన ఉత్సాహంతో ఉన్న ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరీస్‌లో మరో పూర్తిస్థాయి స్పిన్ ట్రాక్ ఎదురైనా... తమ దళంలో అందుబాటులో ఉన్న నలుగురు స్పిన్నర్లతో దీటుగా ఎదుర్కొంటామని కోచ్ చెప్పారు. ‘ఒకవేళ తొలి టెస్టులాగే వైజాగ్‌లోని పిచ్ కూడా స్పిన్‌కే అనుకూలిస్తే భయపడం. జట్టులోని స్పిన్నర్లు దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. షోయబ్ బషీర్ అబుదాబిలో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఆడే సిరీస్‌లోనూ రాణించే నైపుణ్యం అతనికి ఉంది. తప్పకుండా ఇక్కడ కూడా అతను ప్రభావం చూపుతాడు’ అని మెకల్లమ్ అన్నాడు. వైజాగ్ చేరుకున్న ఇరుజట్లు భారత్, ఇంగ్లండ్ జట్లు మంగళవారం సాయంత్రం వైజాగ్ చేరుకున్నాయి. నేరుగా హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఇరుజట్ల ఆటగాళ్లు అక్కడి నుంచి బస చేసే హోటల్‌కు వెళ్లిపోయారు. అనంతరం ఆటగాళ్లంతా ప్రయాణ బడలిక దృష్ట్యా పూర్తిగా హోటల్ గదులకే పరిమితమయ్యారు. ఫిబ్రవరి 2 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో టెస్టు జరుగుతుంది. -
స్పిన్ పిచ్లే సిద్ధం చేస్తే...
ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టు అన్నీ స్పిన్ పిచ్లే తయారు చేస్తుందని భావించడం లేదని ఆ జట్టు సీనియర్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో అభిప్రాయ పడ్డాడు. ప్రస్తుతం భారత పేస్ బౌలింగ్ దళం చాలా పటిష్టంగా ఉందని, అన్నీ స్పిన్ పిచ్లే ఉంటే వారి ప్రభావం తగ్గిపోతుందని అతను అన్నాడు. భారత్‌లో జరిగిన గత సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో బెయిర్‌స్టో మూడు సార్లు డకౌటయ్యాడు. ‘సిరీస్‌లో మాకు వేర్వేరు తరహాలో పిచ్‌లు ఎదురవడం ఖాయం. అయితే అన్నీ టర్న్ కాకపోవచ్చు. వారి పేస్ బౌలింగ్ ఇటీవల ఎలా ఉందో మేం చూస్తున్నాం. ఇప్పుడు పేస్ కూడా వారి బలం కాబట్టి తొలి రోజునుంచే టర్న్ అయ్యే పిచ్‌లు తయారు చేయకపోవచ్చు. అయితే ఎలా ఉన్నా పరిస్థితులకు తగినట్లుగా మా బ్యాటింగ్‌ను మార్చుకునేందుకు మేం సిద్ధంగా ఉండాలి. అశ్విన్, జడేజా, అక్షర్... ఇలా బౌలర్ ఎవరైనా కావచ్చు. మేం అతిగా ఆలోచించడం లేదు. గత సిరీస్‌లో చెన్నైలో మేం కూడా టెస్టు మ్యాచ్ గెలిచామనే సంగతి మరచిపోవద్దు’ అని బెయిర్‌స్టో చెప్పాడు. 2021లో జరిగిన సిరీస్‌ను భారత్ 3–1తో సొంతం చేసుకుంది. -
నాలుగో రోజూ ఆడొచ్చు
ఫిరోజ్ షా కోట్ల పిచ్‌పై దక్షిణాఫ్రికా అభిప్రాయం న్యూఢిల్లీ: స్పిన్ పిచ్‌లతో రెండు టెస్టుల్లో మూడు రోజుల్లోపే చేతులెత్తేసిన దక్షిణాఫ్రికా జట్టు... ఫిరోజ్ షా కోట్లలో గురువారం నుంచి జరిగే టెస్టు నాలుగు రోజుల పాటు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ పిచ్ కూడా స్పిన్నర్లకు సహకరించినా... చలి వాతావరణం కారణంగా ఉదయం పూట పేసర్లకు కొంత సహకారం లభించవచ్చనేది ఆ జట్టు అంచనా. మంగళవారం జట్టు ప్రాక్టీస్ సందర్భంగా కోచ్‌లు సుదీర్ఘంగా పిచ్‌ను పరిశీలించారు.మరోవైపు భారతజట్టు కూడా సుమారు రెండున్నర గంటల సేపు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. మా ప్రతిభకు ప్రశంస ఏది: అమిత్ మిశ్రా టెస్టు సిరీస్‌లో తాము అద్భుతమైన ప్రదర్శన చూపెట్టినా దాన్ని ఎవరూ గుర్తించడం లేదని స్పిన్నర్ అమిత్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశాడు. అందరూ పిచ్‌ల గురించే ఎక్కువగా చర్చిస్తున్నారన్నాడు. ఈ చర్చలో తనతో పాటు అశ్విన్, జడేజాల ఘనత మరుగునపడిపోయిందన్నాడు. ‘పిచ్‌ల గురించే కాకుండా మా ఘనత గురించి కూడా కాస్త చర్చిస్తే బాగుంటుంది. గత 15 ఏళ్లుగా భారత్‌లో పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. మేం లంకకు వెళ్లినప్పుడు కూడా టర్నింగ్ ట్రాక్‌లపై బాగానే రాణించాం. స్పిన్నర్లు బౌలింగ్ బాగా చేస్తే కనీసం వాళ్లను ప్రశంసించండి. కేవలం పిచ్ వల్లే వికెట్లు రాలేదు’ అని మిశ్రా పేర్కొన్నాడు. కఠిన సమయంలో కెప్టెన్ కోహ్లి తనకు బాగా మద్దతిచ్చాడన్నాడు. జడేజా, అశ్విన్‌లతో సమన్వయం కుదరడం వల్లే బాగా రాణించగలుగుతున్నానని చెప్పాడు. తనపై జట్టు మేనేజ్మెంట్కు ఎక్కువగా నమ్మకం లేదన్న అంశాన్ని మిశ్రా తోసిపుచ్చాడు. స్టెయిన్ అనుమానం గజ్జల్లో గాయంతో బాధపడుతున్న సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ నాలుగో టెస్టుకూ అందుబాటులో ఉండటంపై అనుమానం నెలకొంది. మంగళవారం జట్టుతో పాటు ప్రాక్టీస్‌కు వచ్చిన స్టెయిన్ నెట్ సెషన్లో పాల్గొనలేదు. అబాట్, మర్చంట్ డిలాంజ్ ఎక్కువసేపు నెట్స్‌లో గడిపారు. కనీసం బౌలింగ్ స్పైక్స్ కూడా లేకుండా మైదానంలోకి వచ్చిన స్టెయిన్ సీట్‌కే పరిమితమయ్యాడు. అయితే ఫిట్నెస్ టెస్టులో భాగంగా కేవలం ఒక రౌండ్ రన్నింగ్ చేశాడు. దీని ఫలితం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఎక్కువ సమయం ఢిల్లీ ఆల్‌రౌండర్ సారంగ్ రావత్‌కు చిట్కాలు చెబుతూ కనిపించాడు. పూర్తి ఫిట్నెస్ సాధించాకే స్టెయిన్ టెస్టు ఆడతాడని అసిస్టెంట్ కోచ్ ఆడ్రియన్ బీరెల్ వెల్లడించారు.