యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ వికెట్‌కీపర్/బ్యాటర్ జానీ బెయిర్‌స్టో స్టంపౌట్ అంశం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆసీస్ ఆటగాళ్లు క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించి బెయిర్‌స్టోను ఔట్ చేశారని కొందరంటుంటే.. రూల్స్ ప్రకారం అది కచ్చితంగా ఔటేనని మరికొందరు వాదిస్తున్నారు. మ్యాచ్ అనంతరం ఇదే అంశంపై ఇరు జట్ల కెప్టెన్లు కూడా స్పందించారు.
BAIRSTOW IS RUN-OUT.
— Johns. (@CricCrazyJohns) July 2, 2023
WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3
బెయిర్‌స్టో స్టంపౌట్‌ను ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ సమర్ధించుకుంటుంటే.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం ఆసీస్ ఆటగాళ్ల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఓ పక్క రూల్స్ ప్రకారం బెయిర్‌స్టో ఔటేనని చెప్పుకొచ్చిన స్టోక్స్.. ఓ ఆటగాడిని ఆ పద్దతిలో ఔట్ చేసి వచ్చే గెలుపు తమకొద్దని వ్యాఖ్యానించాడు. ఒకవేళ కీలక సమయంలో ఓ ఆటగాడిని అలా ఔట్ చేసే అవకాశం తమకు వచ్చినా తాము వదిలేస్తామని, ఆ పద్ధతిలో గేమ్ గెలవడం తమకు ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. ఇలాంటి సందర్భంలో తాము అప్పీల్ చేసినా వెనక్కు తీసుకునే వాళ్లమని తెలిపాడు. ఆసీస్‌కు అది మ్యాచ్ విన్నింగ్ మూమెంట్ కాబట్టి అలా చేశారని అన్నాడు.
కాగా, ఆఖరి రోజు ఆటలో బెయిర్‌స్టో ఔట్ కావడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. స్టోక్స్ వీరోచిత పోరాటం (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) చేసినా ఇంగ్లండ్ మ్యాచ్ గెలవలేకపోయింది. భారీ లక్ష్యఛేదనలో స్టోక్స్‌కు సహకరించే వారు లేకపోవడంతో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. ఒకవేళ బెయిర్‌స్టో విషయంలో ఆసీస్ తమ అప్పీల్‌ను వెనక్కు తీసుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఏది ఏమైనప్పటికీ ఆసీస్ 43 పరుగుల తేడాతో గెలుపొంది, 5 మ్యాచ్ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment