
లండన్: ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టో ఈ ఏడాది తన జోరును కొనసాగిస్తున్నాడు. టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో బెయిర్ స్టో 93 పరుగులు చేసి ఇంగ్లండ్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అదే సమయంలో 2018 సీజన్‌లో అత్యధిక పరుగులు(అన్ని ఫార్మాట్లలో) చేసిన ఆటగాళ్ల జాబితాలో బెయిర్ స్టో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని అధిగమించాడు. ప్రస్తుతం బెయిర్ స్టో(1482) తొలి స్థానంలో ఉండగా, కోహ్లి(1421) రెండో స్థానంలో ఉన్నాడు. భారత్‌తో టెస్టుకు ముందు 1389 పరుగులతో ఉన్న బెయిర్ స్టో కీలక ఇన్నింగ్స్ ఆడి టాప్‌కు చేరుకున్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్(1357) మూడో స్థానంలో నిలిచాడు.
ఫార్మాట్ల వారీగా బెయిర్ స్టో-కోహ్లి పరుగులు ఇలా..
టెస్టు ఫార్మాట్
బెయిర్ స్టో: 445 పరుగులు, 7 మ్యాచ్‌లు
కోహ్లి: 509 పరుగులు, 5 మ్యాచ్‌లు
వన్డే ఫార్మాట్
బెయిర్ స్టో: 970 పరుగులు, 19 మ్యాచ్‌లు
కోహ్లి: 749 పరుగులు, 9 మ్యాచ్‌లు
అంతర్జాతీయ టీ20లు
బెయిర్ స్టో: 67 పరుగులు, 4 మ్యాచ్‌లు
కోహ్లి: 146 పరుగులు, 7 మ్యాచ్‌లు