యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔట్ వివాదంతో 'క్రీడాస్పూర్తి' అనే పదం మరోసారి తెరపైకి వచ్చింది. క్రీడాస్పూర్తి ప్రకారం చూస్తే అలెక్స్ క్యారీ చేసింది తప్పని చెప్పొచ్చు.. కానీ న్యాయంగా చూస్తే బెయిర్ స్టో అవుట్ కిందే లెక్క. బంతి ఇంకా డెడ్ కాకముందే బెయిర్ స్టో క్రీజు దాటడం తప్పు. ఇదే అదనుగా భావించిన అలెక్స్ క్యారీ అతన్ని రనౌట్ చేశాడు.
రూల్స్ ప్రకారం ఒక బంతి డెడ్ కావడానికి ముందే బ్యాటర్ క్రీజు దాటిన సమయంలో కీపర్ వికెట్లను గిరాటేస్తే అది ఔట్ కిందే లెక్కిస్తారు. అయితే అప్పీల్‌ను వెనక్కి తీసుకునే అవకాశం కెప్టెన్‌కు ఉంటుంది. కానీ పాట్ కమిన్స్ అందుకు సిద్ధపడలేదు. జట్టు గెలుపు దిశలో ఉన్నప్పుడు క్రీడాస్పూర్తి ప్రదర్శించడానికి కమిన్స్ వెనకాడాడు.
కానీ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మాత్రం క్రీడాస్పూర్తికి విలువనిచ్చాడు. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో ఔటైన ఇయాన్ బెల్‌ను మళ్లీ వెనక్కి పిలిచి ధోని క్రీడాస్పూర్తి చాటుకున్నాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 319 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఓడినా ధోని మాత్రం తన చర్యతో ఇంగ్లండ్ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. క్రీడాస్పూర్తి అనే అంశం మరోసారి తెరమీదకు రావడంతో ధోని ప్రదర్శించిన క్రీడాస్పూర్తిని ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం.
2011లో టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించింది. నాటింగ్‌హమ్ వేదికగా ఇరుజట్లు టెస్టు మ్యాచ్ ఆడాయి. టీ విరామానికి ముందు ఇషాంత్ శర్మ ఆఖరి ఓవర్ వేశాడు. ఆ ఓవర్‌లో ఇషాంత్ వేసిన ఒక బంతిని ఇయాన్ మోర్గాన్ లెగ్‌సైడ్ దిశగా ఆడాడు. నేరుగా బౌండరీ లైన్ వద్ద ఉన్న ప్రవీణ్ కుమార్ బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి మిస్ అయి బౌండరీ పక్కన పడింది. అయితే అది బౌండరీనా కాదా అని సందేహం ఉన్న సమయంలోనే ప్రవీణ్‌కుమార్ బంతిని తీసుకొని ధోనికి అందించాడు.
ధోని కూడా కామన్‌గా బంతి అందుకొని బెయిల్స్‌ను ఎగురగొట్టాడు. కానీ ఇయాన్ బెల్ అప్పటికే క్రీజు బయట ఉన్నాడు. ఇది గమనించిన అంపైర్ బంతి ఇంకా డెడ్ కాలేదని.. థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి ఇంకా డెడ్ కాకముందే ఇయాన్ బెల్ క్రీజు బయటకు వెళ్లడంతో రనౌట్ అని బిగ్‌స్క్రీన్‌పై వచ్చింది. అప్పటికే పెవిలియన్ దగ్గర వేచి ఉన్న ఇయాన్ మోర్గాన్, ఇయాన్ బెల్‌లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. మిగతా ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా బాల్కనీ నుంచి అసలేం ఏం జరుగుతుందో అర్థంకాక నిలబడిపోయారు.
అంతలో టీ విరామం రావడంతో మైదానంలోని ప్రేక్షకులు ధోని చేసిన పనికి చివాట్లు, శాపనార్థాలు పెట్టారు. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమని.. ధోని లాంటి కెప్టెన్ ఇలా చేస్తాడా అంటూ సూటిపోటి మాటలు అన్నారు. కానీ టీ విరామం అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సమయానికి ఇయాన్ మోర్గాన్‌తో పాటు ఇయాన్ బెల్ కూడా వచ్చాడు. దీంతో షాక్ తిన్న అభిమానులు ఒక్కసారిగా మాట మార్చారు. ధోని నిర్ణయాన్ని స్వాగతిస్తూ టీమిండియాను చప్పట్లతో అభినందించారు.
అయితే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాకా అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌తో ధోని సంప్రదింపులు జరిపి అప్పీల్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. ఈ విషయాన్ని అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్‌కు చెప్పగానే అతను కృతజ్ఞతగా ధోనిని హగ్ చేసుకోవడం అందరిని ఆకట్టుకుంది. అనంతరం మైదానంలో కూల్‌గా కనిపించిన ధోనిని చూస్తూ అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఈ వీడియోనూ ఇంగ్లండ్ అభిమానులు రీట్వీట్ చేస్తూ ''కమిన్స్.. క్రీడాస్పూర్తి అంటే ఏంటో తెలియకపోతే ధోనిని చూసి నేర్చుకో.. ఇలా చీటింగ్ చేసి గెలవడం కరెక్ట్ కాదు'' అంటూ హితబోద చేశారు.
Jonny Bairstow Runout reminds me of "When MS Dhoni called back Ian Bell after Run out even though he was out"
— 🏆×3 (@thegoat_msd_) July 2, 2023
(Full Story in Thread) pic.twitter.com/TQuHne7HD4
BAIRSTOW IS RUN-OUT.
— Johns. (@CricCrazyJohns) July 2, 2023
WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3
చదవండి: బెయిర్ స్టో ఔట్ వివాదం.. మొదలుపెట్టింది ఇంగ్లండే కదా!
Ashes Series 2023: గెలుపు జోష్‌లో ఉన్న ఆసీస్‌కు భారీ షాక్.. ఇకపై కష్టమే..!
Comments
Please login to add a commentAdd a comment