
డిసెంబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ లిస్ట్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్, బంగ్లాదేశ్ పేసర్ తైజుల్ ఇస్లాం ఉన్నారు. వీరిముగ్గురూ డిసెంబర్ నెలలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు.
ప్యాట్ కమ్మిన్స్ విషయానికి వస్తే.. స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కమ్మిన్స్ నిప్పులు చేరిగాడు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఏకంగా 10 వికెట్లతో కమ్మిన్స్ సత్తాచాటాడు. అదేవిధంగా న్యూజిలాండ్‌తో డిసెంబర్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లో బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం నిప్పులు చేరిగాడు. తొలి టెస్టులో 6 వికెట్లు తీసి బంగ్లాకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.
అదే సిరీస్‌లో కివీస్ మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్‌లో 5 వికెట్లతో సత్తాచాటిన అనంతరం బ్యాటింగ్‌లో కూడా 87 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ముగ్గురిలో అవార్డు ఎవరికి వరిస్తుందో వేచి చూడాలి. ఇక మహిళల విభాగంలో భారత భారత క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ నిలిచారు. వీరిద్దరితో పాటు జింబాబ్వే బౌలర్ ప్రీసియస్ మరంగే తొలిసారి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు బరిలో నిలిచింది.
చదవండి: AUS vs PAK: 'అతడు ఓపెనర్‌గా వస్తే.. లారా 400 పరుగుల రికార్డు బద్దలవ్వాల్సిందే'
Comments
Please login to add a commentAdd a comment