
ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ గతేడాది (2023) క్రికెట్‌లో సాధించాల్సిన ఘనతలన్నీ సాధించాడు. ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా నిలబెట్టిన కమిన్స్.. ఆతర్వాత ఇంగ్లండ్‌పై యాషెస్ సిరీస్ విజయం, వన్డే వరల్డ్‌కప్ విక్టరీ, ఐపీఎల్ 2024 వేలంలో 20.25 కోట్ల రికార్డు ధర, బాక్సింగ్ డే టెస్ట్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, టెస్ట్‌ల్లో హ్యాట్రిక్ ఐదు వికెట్ల ఘనత.. ఇలా ఫార్మాట్లకతీతంగా గతేడాది అన్ని ఘనతలను సాధించాడు.
తాజాగా కమిన్స్ 2023 డిసెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా దక్కించుకుని గతేడాది అత్యధిక సక్సెస్ సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. డిసెంబర్ నెల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం బంగ్లాదేశ్ ఆటగాడు తైజుల్ ఇస్లాం, కివీస్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ పోటీ పడినప్పటికీ అంతిమంగా అవార్డు కమిన్స్‌నే వరించింది.
కమిన్స్ డిసెంబర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నిప్పులు చెరిగాడు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో అతను ఏకంగా 10 వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు తైజుల్ ఇస్లాం, గ్లెన్ ఫిలిప్స్ సైతం గత నెలలో అద్భుతంగా రాణించారు. తైజుల్ న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 6 వికెట్ల ప్రదర్శనతో రాణించి, బంగ్లాకు చారిత్రక విజయాన్ని అందించాడు. ఇదే సిరీస్‌లో కివీస్ మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ సైతం అద్భుతంగా ఆడాడు. బౌలింగ్‌లో 5 వికెట్ల ఘనతతో పాటు బ్యాటింగ్‌లో 87 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
మహిళల విభాగంలో దీప్తి శర్మ..
మహిళల విషయానికొస్తే డిసెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మను వరించింది. ఈ అవార్డు కోసం మరో టీమిండియా ప్లేయర్ జెమీమా రోడ్రిగెజ్, జింబాబ్వే బౌలర్ ప్రీసియస్ మరంగే పోటీపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment