పాకిస్తాన్ స్టార్ స్పిన్నర్ నోమన్ ఆలీకి తొలిసారి ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది. ఈ ఏడాది ఆక్టోబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను నోమన్ అలీకి ఈ అవార్డు దక్కింది.
దాదాపు ఏడాది తర్వాత పాక్ టెస్టు జట్టులోకి తిరిగి వచ్చిన నోమన్.. గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. 2 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టి పాక్ జట్టుకు అద్బుతమైన సిరీస్ విజయాన్ని అందించాడు. బ్యాట్‌తో కూడా 78 పరుగులు చేశాడు.
రబడాను వెనక్కి నెట్టి..
కాగా ఈ అవార్డు కోసం నోమన్ అలీతో పాటు ప్రోటీస్ స్టార్ పేసర్ నోమన్ కగిసో, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్‌లు పోటీ పడ్డారు. . బంగ్లాదేశ్‌తో జరిగిన 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో రబాడ 14 వికెట్లు పడగొట్టాడు.
టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రబాడ నిలిచాడు. మరోవైపు భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సాంట్నర్ కూడా అదరగొట్టాడు. 92 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా భారత్‌ను కివీస్ వైట్‌వాష్ చేయడంలో సాంట్నర్ కీలక పాత్ర పోషించాడు. అయితే వీరిద్దిరికంటే నోమాన్ వ్యక్తిగత ప్రదర్శన పరంగా ముందుండడంతో ఈ ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు.
చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియా స్టార్ ప్లేయర్‌పై వేటు! అతడికి ఛాన్స్?
Comments
Please login to add a commentAdd a comment