
అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రతీ నెలా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పురుష, మహిళ క్రికెటర్లకు 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్' అవార్డులను ఇస్తుంది. తాజాగా ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. ఈ అవార్డులలో శ్రీలంక ప్లేయర్స్ సత్తాచాటారు.
పురుషుల, మహిళల విభాగాల్లో రెండు అవార్డులు కూడా శ్రీలంకకే దక్కడం గమనార్హం. మెన్స్ కేటగిరీలో లంక యువ స్పిన్ సంచలనం దునీత్ వెల్లలాగే, మహిళల క్రికెట్ విభాగంలో శ్రీలంక స్టార్ బ్యాటర్ హర్షిత సమరవిక్రమ ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నారు.
అదరగొట్టిన దునీత్..
గత నెలలో స్వదేశంలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వెల్లలాగే కీలక పాత్ర పోషించాడు. లంక సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో వెల్లలాగే కీలక పాత్ర పోషించాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వెల్లలాగే 133 పరుగులతో పాటు 7 వికెట్లు పడగొట్టాడు.
అందులో ఓ ఫైవ్ వికెట్ హాల్ కూడా ఉంది. ఈ క్రమంలోనే అతడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. తద్వారా ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు అందుకున్న ఐదో లంక ఆటగాడిగా దునీత్ నిలిచాడు.
ఈ జాబితాలో ఏంజెలో మాథ్యూస్ (మే 2022), ప్రబాత్ జయసూర్య (జూలై 2022), వనిందు హసరంగా (జూన్ 2023), కమిందు మెండిస్ (మార్చి 2024) ఉన్నారు. మరోవైపు లంక మహిళా క్రికెటర్ హర్షిత సమరవిక్రమ ఐర్లాండ్ పర్యటనలో అదరగొట్టింది.
చదవండి: కోహ్లిని చూసి నేర్చుకో బాబర్.. లేకుంటే కష్టమే: యూనిస్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment