
సాక్షి, మంగళగిరి: టీడీపీ నేత నారా లోకేశ్‌కు బిగ్ షాక్ తగిలింది. లోకేశ్‌పై మంగళగిరి మండల టీడీపీ మాజీ అధ్యక్షురాలు కృష్ణవేణి తీవ్ర విమర్శలు చేశారు. ట్విటర్‌లో మార్ఫింగ్‌తో తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్, అతని ఐటీ టీంపై చర్యలు తీసుకోవాలని ఆమె.. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.