ఎన్నికల ప్రచారం: సామాన్యులతో లావణ్య.. శ్రీమంతులతో లోకేష్
ఓటర్లతో మమైకమవుతోన్న వైఎస్సార్‌సిపి అభ్యర్థి లావణ్య
శ్రీమంతులతో తెర వెనక లోకేష్ మంతనాలు
మంగళగిరిలో అద్దం పడుతోన్న ప్రచార పర్వాలు
ఒకరిది ప్రజా జీవితం.. మరొకరిది తెరవెనుక మంత్రాంగం.. ఒకరిది ధీమా.. మరొకరిది ఆందోళన.. ఒకరిది జనంతో మమేకమైన ప్రచారం.. మరొకరిది కార్పోరేట్ ప్రచారం. ఈ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎం. లావణ్య. మరొకరు నారా లోకేష్. వైఎస్సార్‌సీపీ నుంచి మంగళగిరి నియోజకవర్గం నుంచి లావణ్య పోటీకి దిగుతుండగా, అక్కడ టీడీపీ తరఫున నారా లోకేష్ బరిలో ఉన్నారు.
వీరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అయిన లావణ్య తన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లతో మమైకమవుతున్నారు. సామాన్యులతో కలిసిపోతూ ఎన్నికల ప్రచార హెరులో ముందు వరుసలో ఉన్నారు. జనంతో కలివిడిగా కలిసిపోతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వపు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు లావణ్య. వంద శాతం గెలుపు ధీమాతో ప్రచారాన్ని సాగిస్తున్న లావణ్య.. ప్రస్తుతం మెజార్టీ ఎంత అనే దానిపైనే కన్నేశారు.
అదే సమయంలో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌లో మాత్రం రోజు రోజుకు ఆందోళన ఎక్కువ అవుతోంది. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన లోకేష్‌కు మరొకసారి ఓటమి భయం వెన్నాడుతోంది. మంగళగిరిలో లోకేష్ జనంలోకి వెళ్లేదానికంటే ప్రైవేట్ మీటింగ్‌లతో సరిపెడుతున్నారు. ఓటర్లను గ్రూపులుగా విభజించడం, డబ్బులతో ఏ రకంగా కొనేయాలన్నదానిపై లోకేష్ సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. ఒకటి రెండు సార్లు జనంలోకి వెళ్లినా.. ప్రచారం మాత్రం సప్పగా సాగుతోందని స్థానికులంటున్నారు. కేవలం కార్పోరేట్ తరహా సమావేశాలు పెడుతూ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.
ఈ సారి విషమ పరీక్షే
చంద్రబాబు నాయుడు కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్.. ఇప్పటివరకు ఏ ఎన్నికలోనూ గెలిచింది లేదు. గత ఎన్నికల్లో మంగళగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేసి చిత్తుగా ఓడిపోయాడు లోకేష్. రాజకీయంగా ఆయన ఇప్పటికి సాధించిన అద్భుతాలు లేవు. లోకేష్‌ను ఏ రకంగానైనా ప్రమోట్ చేయాలన్న తాపత్రయంలో చంద్రబాబు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశాడు. అదేంటో గానీ.. జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న తెలుగుదేశం కాస్తా.. లోకేష్ సారథ్యంలో కనీసం తెలంగాణలో పోటీ కూడా చేయలేదు. మరే రాష్ట్రంలో పోటీ చేసే సత్తా గానీ, మద్ధతు గానీ లేదు. అయినా తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా చెప్పుకోవడం, దానికి జాతీయ కార్యదర్శిగా లోకేష్‌ను ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకే చెల్లింది. ఈసారి బోలెడు అపశకునాల మధ్య మంగళగిరిలో భవిష్యత్తు కోసం లెక్కలేసుకుంటున్నాడు. తేడా వచ్చిందా.? హెరిటేజ్ పాలమ్ముకోవడం తప్ప మరో దారి లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
Comments
Please login to add a commentAdd a comment