
మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతోంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తనయుడు లోకేష్ రెండోసారి ఓటమికి సిద్ధమవుతున్నారు. గతంలో చంద్రబాబు పాలనలో దొడ్డిదారిన మంత్రి పదవి వెలగబెట్టిన లోకేష్ మంగళగిరిలో పునాది వేసుకోలేకపోయారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్‌కే మంగళగిరిని ఊహించనిరీతిలో అభివృద్ధి చేశారు. వైఎస్ జగన్ పాలనకు జనం జేజేలు పలుకుతున్నారు. పోలింగ్ రోజు ఉదయమే బారులు తీరిన ఓటర్లే జగన్ పాలనకు ఆమోదమనే చర్చ జరుగుతోంది.
ఆర్కే చేతిలో తొలి పరాజయం
గుంటూరు జిల్లా ముఖద్వారం మంగళగిరి నియోజకవర్గాన్ని మూడోసారి కూడా వైఎస్సార్‌సీపీ పార్టీ కైవసం చేసుకోబోతోంది. గత రెండు ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ తరఫున ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇక్కడి నుంచి గెలుపొందారు. 2019లో టీడీపీ తరపున అప్పటి మంత్రి, ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్ పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.
తండ్రితో కలిసి హైదరాబాద్ పరార్
ఓటమి తర్వాత ఏడాదికిపైగా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. కరోనా సమయంలో కరకట్ట మీది ఇల్లు వదిలి తండ్రితో కలిసి హైదరాబాద్ పారిపోయారు. దీంతో మంగళగిరిలో టీడీపీ క్యాడర్ కకావికలమైంది. లోకేష్‌ను కలవాలంటే క్యాడర్‌కు సాధ్యమయ్యేది కాదు.
సీఎం జగన్ పాలనలో మారిన మంగళగిరి రూపురేఖలు
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ చేరాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 500 కోట్లతో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. దీంతో పాటుగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా 1700 కోట్లు లబ్ధిదారుల ఖాతాలోకి వెళ్లాయి. వైఎస్ జగన్ పాలనలో మంగళగిరి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
ఎప్పుడూ ప్రజలకు అందుబాటలో..
తాడేపల్లి, మంగళగిరి కలిపి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మంగళగిరి అభివృద్ధిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండటమే గాకుండా అవినీతికి తావు లేకుండా, ప్రతి అభివృద్ధి పనినీ ఆయనే దగ్గరుండి పర్యవేక్షించారు. జగన్ పాలన పట్ల ఆకర్షితులైన నియోజకవర్గంలోని కీలక టీడీపీ నేతలు గంజి చిరంజీవి, మురుగుడు హనుమంతరావు వైఎస్సార్ సీపీలో చేరి మరింత బలోపేతం చేశారు.
చేనేత వస్త్రాలకు పేరు గాంచిన మంగళగిరిలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చేనేత షెడ్లను ఏర్పాటు చేశారు. నేతన్నలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను మార్కెట్లో అమ్ముకోవడానికి చేనేత బజారు ఏర్పాటు చేశారు. మంగళగిరిని అన్ని విధాల అభివృద్ధి చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారింది. మరోవైపు లోకేష్ వ్యవహార శైలితో తెలుగుదేశం పార్టీ రోజురోజుకు దిగజారిపోతూ వచ్చింది.
లావణ్యకు వైఎస్సార్‌సీపీ టికెట్..
మంగళగిరిలో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఈ సీటును బీసీలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. అందులో భాగంగానే వరుసగా రెండుసార్లు గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డిని కాకుండా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మురుగుడు లావణ్యకు వైఎస్సార్‌సీపీ టికెట్‌ను కేటాయించింది. మురుగుడు లావణ్య మామయ్య మురుగుడు హనుమంతరావు గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. లావణ్య తల్లి కాండ్రు కమల కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. దీంతో నియోజకవర్గంపై వారిద్దరికీ మంచిపట్టుంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల, మరోనేత గంజి చిరంజీవి కలిసికట్టుగా ఎన్నికల యుద్ధంలో దిగటంతో లోకేష్‌కు మైండ్ బ్లాక్ అయింది. తనకు బలం లేకపోయినా డబ్బుతో గెలవాలని నిర్ణయించుకున్న లోకేష్ కోట్లు కుమ్మరించారు.
పోలింగ్ రోజు ఉదయం 6 గంటలకే క్యూ
అంతేకాదు 30 మంది డమ్మీ క్యాండెట్లను రంగంలోకి దించి ఓట్లు చీల్చడానికి, ఓటర్లను గందరగోళపరచడానికి కుట్రపన్నారు. కానీ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో జగన్ పాలనకే మంగళగిరి ప్రజలు పోలింగ్ రోజు జైకొట్టారు. ఉదయం 6 గంటలకే వృద్ధులు మహిళలతో పాటు బీసీ, ఎస్‌సీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు గంటలకొద్దీ క్యూల్లో నిలుచుని ఫ్యాన్‌ను గిరగిరా తిప్పారు.
వైస్సార్‌సీ ప్రభుత్వంలో కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిన మంగళగిరి మరింత అభివృద్ధి చెందాలంటే మురుగుడు లావణ్యను గెలిపించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని ప్రజలు భావించారు. లోకేష్ ఎన్ని కుట్రలు చేసినా మరోసారి ఆయనకు ఓటమి తప్పదనే టాక్ మంగళగిరిలో గట్టిగా వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment