12 మంది డిగ్రీ విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు
Published Sat, Apr 1 2017 10:21 PM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM
కర్నూలు(ఆర్‌యూ): రాయలసీమ విశ్వవిద్యాలయ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో శనివారం జరిగిన మూడో సంవత్సరం డిగ్రీ పరీక్షలో జిల్లా వ్యాప్తంగా 12 మంది విద్యార్థులపై ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెంకటేశ్వర్లు తెలిపారు. తుగ్గలి ఏఎస్ డిగ్రీ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు, పత్తికొండ రాఘవేంద్ర కళాశాలకు చెందిన ఇద్దరు, ఆలూరు రాఘవేంద్ర కళాశాలకు చెందిన నలుగురు, ఆలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి, బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
Advertisement