Mumbai news
-
బుల్ మరోసారి కుదేల్
ముంబై: దేశీయ స్టాక్ సూచీలకు లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలకు తోడు విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో గురువారం దాదాపు ఒక శాతం నష్టపోయాయి. ఉదయం లాభాల్లో మొదలైన సూచీలు.., కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెపె్టంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో రోజంతా సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్, మెటల్, బ్యాంకింగ్ రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. ఫలితంగా సెన్సెక్స్ 610 పాయింట్లు నష్టపోయి 65,508 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 695 పాయింట్లు క్షీణించి 65,423 వద్ద నిలిచింది. ఈ సూచీ దాదాపు పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.95 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.316 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఈ సూచీలో 30 షేర్లకు గానూ అయిదు షేర్లు మాత్రమే లాభ పడ్డాయి. నిఫ్టీ 193 పాయింట్లు పతనమై 19,524 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో 224 పాయింట్లు నష్టపోయి 19,492 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,364 కోట్లు అమ్మేయగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,711 కోట్ల ఈక్విటీలు కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ స్వల్పంగా మూడు పైసలు పెరిగి 83.19 వద్ద స్థిరపడింది. అధిక వడ్డీరేట్ల పెంపు అంచనాలకు తోడు తాజాగా బ్యారెల్ చమురు ధర 100 డాలర్లకు చేరువవడం, చైనాలో ప్రాపర్టీ మార్కెట్ సంక్షోభ ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతోంది. ‘‘అధిక వెయిటేజీ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి తోడు ప్రతికూల ప్రపంచ సంకేతాలు సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. ఎన్ఎస్ఈ సూచీల్లో స్టాక్స్ వెయిటేజీకి సంబంధించిన మార్పులు అమల్లోకి వస్తుండటంతో దీని అనుగుణంగా ట్రేడర్ల తమ పొజిషన్లను సవరించుకున్నారు. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర ఈ ఏడాది(2023) గరిష్ట స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. మార్కెట్లో అస్థిరతలను సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ 4 నెలల గరిష్టానికి చేరుకోవడం ప్రతికూలంగా మారింది. ఒకవేళ నిఫ్టీ 19,500 స్థాయిని కోల్పోతే ఆగస్టు కనిష్టం 19,220 స్థాయికి దిగిరావచ్చు’’ అని రిలిగేర్ బ్రోకరింగ్ సాంకేతిక నిపుణుడు అజిత్ మిశ్రా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు.. ► యాత్రా ఆన్లైన్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.142)తో పోలిస్తే 8% డిస్కౌంట్‌తో రూ.130 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో పదిశాతానికి పైగా నష్టపోయి రూ.127 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివర్లో కొంత కొనుగోళ్ల మద్దతు లభించడంతో 4% నష్టంతో రూ.136 వద్ద నిలిచింది. కంపెనీ విలువ రూ.2,133 కోట్లుగా నమోదైంది. ఎక్సే్చంజీలో 7.43 లక్షల ఈక్విటీలు చేతులు మారాయి. ► ఐటీ రంగ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. టెక్ మహీంద్రా 4%, ఎంఫసిస్ 3%, ఎల్టీఐఎం 2.50%, విప్రో 2% పర్సిస్టెంట్, ఇన్ఫోసిస్ టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, కోఫోర్జ్ షేర్లు ఒకశాతం చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఐటీ సూచీ అత్యధికంగా రెండుశాతం క్షీణించింది ► అధిక వెయిటేజీ రిలయన్స్(1.50%), ఐటీసీ(2%), ఇన్ఫోసిస్ (2%), టీసీఎస్(1.50%) మారుతీ సుజుకీ, కోటక్ బ్యాంక్ షేర్లు ఒకశాతం నష్టపోయి సూచీల భారీ పతనానికి కారణమయ్యాయి. ► నష్టాల మార్కెట్లోనూ ఎల్అండ్టీ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో మూడుశాతం ర్యాలీ చేసి రూ.3051 వద్ద కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి ఒకటిన్నర శాతం లాభపడి రూ.3012 వద్ద నిలిచింది. సెన్సెక్స్, నిఫ్టీలో అత్యధికంగా లాభపడిన సూచీ ఇదే. -
విద్యార్థి 35 శాతం మార్కులకే సంబరాల్లో కుటుంబం..వీడియో వైరల్
మహారాష్ట్ర: పరీక్షల్లో తప్పితే జీవితంలో తప్పినట్లు భావిస్తుంటారు కొందరు పిల్లలు. ఫలితాలను విడుదల చేసిన మరుసటి రోజు.. పేపర్లలో ఫెయిలైన విద్యార్థుల ఆత్మహత్య వార్తలను సాధారణంగా చూస్తుంటాం. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ విధానం కొనసాగుతూ వస్తోంది. అయితే.. ఇందుకు భిన్నంగా 35 శాతం మార్కులతో పాస్ అయిన ఓ విద్యార్థికి తన తల్లిదండ్రులు వేడుక చేశారు. ఈ స్ఫూర్తిదాయక సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. ఇటీవల మహారాష్ట్రలో విద్యాశాఖ పదో తరగతి విద్యార్థుల ఫలితాలను విడుదల చేసింది. ఇందులో ఓ ఆటోడ్రైవర్ కుమారుడు అన్ని సబ్జెక్టుల్లో 35 శాతం మార్కులతో పాస్ అయ్యాడు. తక్కువ మార్కులు సాధించినందుకు తిట్టకుండా తమ కుమారునికి ఆ కుటుంబం సంబరాలు చేసింది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవినీష్ శరణ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాను కామెంట్ చేశారు. కింది స్థాయిల్లో తక్కువ మార్కులు సాధించినప్పటికీ జీవితంలో తాము సాధించిన గొప్ప విజయాలను పంచుకున్నారు. मुंबई के रहने वाले 10वीं के एक छात्र ने परीक्षा में 35% मार्क्स हासिल किए. लेकिन उसके माता-पिता ने दुखी या नाराज होने की बजाय उसकी सफलता को सेलिब्रेट किया. pic.twitter.com/fAa6szayiF — Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) June 8, 2023 ఇదీ చదవండి:ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లనిపించేది ఇలాంటి సందర్భాల్లోనే కావొచ్చు..! -
రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాకే..
సాక్షి ముంబై: యుద్ధనౌక ‘విక్రాంత్’ భద్రతా బాధ్యతలు చేపట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదని, అంతేకాక ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా గత 15 సంవత్సరాల్లో సేకరించి ఇవ్వలేకపోయిందని, అందుకే తుక్కు కింద అమ్మాలని నిర్ణయించినట్లు బాంబే హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం తెలిపింది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వివరాలిలా ఉన్నాయి... ‘భారత నౌకాదళం 1997 నుంచి విక్రాంత్ సేవలను నిలిపివేసింది. దీంతో ఆ నౌకను తుక్కు కింద విక్రయించడం లేదా మ్యూజియంగా మార్చడం వంటి రెండు ప్రతిపాదనలను రూపొందించింది. 1998లో విక్రాంత్‌ను మ్యూజియంగా మారుస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపించింది. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం విక్రాంత్‌ను నిలిపేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని, మరమ్మతులు పూర్తికాగానే దాని భద్రత బాధ్యతలు స్వీకరించాలని కేంద్రం షరతులు విధించింది. ఈ షరతుల్లో ఏ ఒక్కదాన్నీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. దీంతో రోజురోజుకూ ‘విక్రాంత్’ నిర్వహణ వ్యయం పెరిగిపోతూనే ఉంది. గడిచిన 15 ఏళ్లలో కేంద్రం ప్రభుత్వం దాదాపు రూ.22 కోట్లు ఖర్చుచేసింది. కే ంద్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో రెండు సార్లు ఈ నౌకను ప్రజల సందర్శనార్థం తెరిచింది. ప్రస్తుతం విక్రాంత్ నౌక వయస్సు 70 సంవత్సరాలు. భద్రత దృష్ట్యా ఈ నౌక ప్రమాదకరంగా మారింది. అయినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను, ఇతర ప్రత్యామ్నాయ అంశాలను కేంద్రం పరిశీలించింది. అయినప్పటికీ వాటివల్ల ప్రయోజనమేమీ లేదనే అభిప్రాయంతోనే విక్రాంత్‌ను తుక్కు సామాగ్రి కింద అమ్మాలని నిర్ణయం తీసుకున్నామ’ని అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఇదిలాఉండగా ఈ నౌకను తుక్కు సామగ్రి కింద అమ్మివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరమే ప్రకటించింది. ఈ నిర్ణయంపై అనేక రంగాల నుంచి విమర్శలు వచ్చాయి. విక్రాంత్‌ను కాపాడుకునేందుకు ఇటీవల సామాజిక సంస్థలు, విద్యార్థులు విరాళాలు సేకరించారు. కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. వీటన్నింటిని పరిగణంలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షా.. ఎందుకు తుక్కు కింద అమ్మాలని నిర్ణయించుకున్నారో తెలపాలని కేంద్రాన్ని ఆదేశించారు. ఆ మేరకు కేంద్ర కోర్టుకు ఈ అఫిడవిట్ సమర్పించింది. -
అక్రమ ‘మొబైల్’ టవర్లపై కొరడా
సాక్షి, ముంబై: నగరంలో విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ మొబైల్ టవర్ల ఆగడాలను నియంత్రించేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎట్టకేలకు నడుం బిగించింది. ఇన్నాళ్లు చూసీచూడనట్టు వ్యవహరించిన కార్పొరేషన్...స్థానికులు, సామాజిక కార్యకర్తల ఆందోళనలు ఉధృతమవడంతో మొబైల్ టవర్లపై నిఘా ఉంచాలనే ప్రతిపాదనకు రూపకల్పన చేసింది. ఆమోదం, సలహాలు, సూచనల కోసం పట్టణ అభివృద్ధి విభాగానికి పంపింది. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నామని, ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారే నిర్ణయిస్తారని డెవలప్మెంట్ ప్లానింగ్ చీఫ్ ఇంజనీర్ రాజీవ్ కుక్నూర్ తెలిపారు. అక్రమ మొబైల్ టవర్లపై కార్పొరేషన్ ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పాఠశాలలు, ఆస్పత్రులు, నివాస భవనాలపైన అమర్చిన మొబైల్ టవర్లపై దృష్టి సారించలేదు. వీటివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సామాజిక కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. వీరికి స్థానికులు కూడా తోడవడంతో విషయ తీవ్రతను గమనించిన కార్పొరేషన్ ఆగమేఘాలపై గత వారంలో మొబైల్ టవర్ల జాబితాను విడుదల చేసింది. నగరంలో ఉన్న 4,776 మొబైల్ టవర్లలో 1,158 మాత్రమే చట్టపర అనుమతులను కలిగి ఉన్నాయని తెలిపింది. వీటిలో 3,618 అక్రమమైనవని వెల్లడించింది. దీంతో 75 శాతం మొబైల్ టవర్లు అక్రమంగా ఏర్పాటు చేశారన్న విషయం స్పష్టమవుతోంది. అయితే అక్రమంగా ఏర్పాటుచేసిన టవర్లకు బీఎంసీ అనుమతినివ్వలేదు. దీంతో నిబంధనల ప్రకారం ఈ టవర్లను నిర్మూలించనున్నారు. దీనివల్ల నగరంలో నెట్వర్క్ కవరేజ్ చాలా తక్కువగా ఉంటుందని టవర్ల నిర్వాహకులు పేర్కొంటున్నారు. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఇప్పటికే వివిధ మొబైల్ నెట్‌వర్క్‌ల నుంచి కాల్ డ్రాప్, నెట్వర్క్ సమస్యలు చాలా ఎదురవుతున్నాయన్నారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే నెట్వర్క్ సమస్య మరింత జటిలమవుతుందన్నారు. బీఎంసీ నియమాల ప్రకారం...ఆస్పత్రులు, విద్యా సంస్థలకు 100 మీటర్ల దూరం వరకు మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడాన్ని నిషేధించారు. భవనాలపై ఈ టవర్లను ఏర్పాటు చేయాలనుకుంటే ఆ సొసైటీ అనుమతి తీసుకోవాలి.