లక్నో: సామాన్య ప్రజలు తమ సమస్యల గోడు వినిపించేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగుతుంటారు. ఒక్కోసారి వారిని పట్టించుకునేవారే ఉండరు. ఉన్నత అధికారులను నేరుగా కలిసే అవకాశమే తక్కువ. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ దెహత్ జిల్లాలో ఓ ఐఏఎస్ అధికారిణి సౌమ్య పాండే మాత్రం తన సింప్లిసిటీతో నెటిజన్ల మనసులు దోచుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పథకం ద్వారా ఎలక్ట్రిక్ బైక్ కొనేందుకు తనకు సాయం చేయాలని వెళ్లిన ఓ పెద్దాయన ధనీరామ్ సమస్యను ఆమె దగ్గరుండి తెలుసుకున్నారు. ఎండలోనూ అతని దగ్గరకు వెళ్లి వివరాలు అడిగి కచ్చితంగా సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
చీఫ్ డెవలెప్‌మెంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న సౌమ్య.. ఈ విషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దివ్యాంగుడైన ధనీరామ్ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసేందుకు అవసరమైన సాయం అంధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సౌమ్య పాండే.. ధనీరామ్ దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడుతున్న ఫొటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అంత పెద్ద హోదాలో ఉండి సామాన్యుడితో సౌమ్య పాండే ప్రవర్తించిన విధానంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. నవ భారత్‌లో సరికొత్త ఉత్తర్‌ప్రదేశ్ ఇది.. చూడండి ఐఏఎస్ అధికారి సామాన్యుడి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు ఎలా తీసుకుంటున్నారో.. అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
చదవండి: రాహుల్ గాంధీకి నిరాశ.. కోర్టులో దక్కని ఊరట.. ఏప్రిల్ 13 వరకు బెయిల్
Comments
Please login to add a commentAdd a comment